శ్రీ మహావిష్ణువు ఆశీస్సులను పొందాలంటే పద్మినీ ఏకాదశి రోజు ఇలా చేయాల్సిందే..?
TeluguStop.com
ఆషాడమాసం శుక్లపక్ష ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని కూడా అంటారు.పద్మినీ ఏకాదశి( Padmini Ekadashi ) ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది.
అయితే ఈ ఏడాది ఆ ఏకాదశి ఎప్పుడు వస్తుంది.దాని విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే దీనిని సముద్ర ఏకాదశి అని కూడా అంటారు.ఈ ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు ఎంతో ఇష్టమైనది.
ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరం పొడవునా పుణ్యం లభిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం పద్మినీ ఏకాదశి జులై 29వ తేదీన పద్మ ఏకాదశి వ్రతం పాటిస్తారు.
ఈ రోజు ఉపవాసం, దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. """/" /
మిగిలిన మాసాలతో పోలిస్తే ఈ ఉపవాసంలో చేసే పూజకు పదిరెట్లా పుణ్యఫలం ఎక్కువగా లభిస్తుంది.
పంచాంగం ప్రకారం ఆషాడం శుక్ల పక్షానికి చెందిన పద్మినీ ఏకాదశి జులై 28న రెండు గంటల 51 నిమిషములకు ప్రారంభమవుతుంది.
మరుసటి రోజు జులై 29వ తేదీన ఒంటిగంట ఐదు నిమిషములకు ముగిసిపోతుంది.కాబట్టి పూజా జులై 29 వ తేదీన ఉదయం ఏడు గంటల 22 నిమిషముల నుంచి 9.
04 నిమిషముల మధ్య లో పూజను మొదలుపెట్టాలి.పద్మిని ఏకాదశి వ్రతా పారాయణం ఉదయం 5:40 నుంచి 8:24 నిమిషముల మధ్యలో ప్రారంభించడం ఎంతో మంచిది.
"""/" /
ఇంకా చెప్పాలంటే పద్మినీ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వ్యక్తి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కచ్చితంగా పొందుతాడు.
ఈ వ్రతాన్ని మించిన త్యాగము, తపస్సు, దానధర్మాలు లేవని పురాణాలలో ఉంది.ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తీర్థ స్నానం చేయాలి.
నీటిలో కొన్ని నువ్వులు వేసి స్నానం చేయడం ఎంతో మంచిది.అలాగే కుంకుమ కలిపిన నీటితో విష్ణువు( Lord Vishnu ) కు అభిషేకం చేయాలి.
ఈ రోజంతా ఉపవాసం లో భగవంతుని భజనలు, మంత్రాలు చదువుతూ ఉండాలి.ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి వారికి తగిన రీతిలో సత్కరించి అప్పుడు మీ ఉపవాస దీక్షను విరమించడం వల్ల మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది.
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్…