వాస్తు ప్రకారం ఆగ్నేయంలో ఈ వస్తువులుంటే.. కష్టాలు ఉండవు!

సాధారణంగా మన హిందువులు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో ఎక్కువగా విశ్వసిస్తారు.ఈ క్రమంలోనే కొందరు ఎలాంటి పని చేయవలసినా దానిని వాస్తు ప్రకారమే చేస్తుంటారు.

 Vastu Tips For Southeast Direction Better Do Not Keep These Southeast, Southeast-TeluguStop.com

అలాగే కొందరు ఇంటి నిర్మాణం చేపట్టినప్పటినుంచి ఇంటిలో అలంకరించుకునే ప్రతి వస్తువు వరకు తప్పనిసరిగా వాస్తు పాటిస్తూ వాస్తుశాస్త్రం ప్రకారమే నడుచుకుంటారు.కొన్నిసార్లు ఇలాంటివన్నీ కేవలం అపోహలని భావించినప్పటికీ కొన్ని విషయాలలో ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటించాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి.

మనం ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవుళ్ళు అధిపతిగా ఉంటారని భావిస్తాము.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క దిక్కును ఎంతో పవిత్రంగా భావిస్తూ.

ఏ దిక్కున ఏ విధమైనటువంటి వస్తువులు ఉంటే శుభపరిణామం కలుగుతుందో తెలుసుకొని ఆ దిక్కున ఆ వస్తువులను ఉంచుతాము.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిక్కులో ఏ విధమైనటువంటి వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఆగ్నేయం అంటే అగ్నికి మూలం.ఆగ్నేయమూల ఎప్పుడూ కూడా ఈశాన్యం కంటే తక్కువగా ఉండాలి.ఈశాన్యం కంటే ఎక్కువగా ఉంటే ఆ ఇంటిలో నిత్యం సమస్యలు ఎదురవుతాయి.ఇలా ఆగ్నేయమూల ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఇంట్లో స్త్రీలు అనారోగ్యానికి గురి కావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఎక్కువగా ఆగ్నేయ మూల వంట చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.అలాగే మన ఇంటి పై భాగంలో నిర్మించే వాటర్ ట్యాంక్ కూడా ఎప్పుడూ ఆగ్నేయం, వాయువ్యం తప్ప ఏ ఇతర మూలలో పెట్టుకోకూడదు.

అలాగే ఆగ్నేయ దిశలో టాయిలెట్స్ కూడా నిర్మించుకోవచ్చు.అయితే తూర్పు గోడకు అటాచ్డ్ గా ఉండాలి.ఈశాన్య మూలలో సంపు లేదా వాటర్ ట్యాంక్ ను ఆగ్నేయం మూలం కంటే ఎక్కువ లోతు తవ్వించాలి.ఇంటికి మెట్లు కూడా తూర్పు ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు.అయితే తూర్పు గోడకు తాకకుండా ఉండాలి.వాస్తు శాస్త్రం ప్రకారం ఆగ్నేయ దిశలో ఏవైనా లోపాలు ఉంటే స్త్రీల వల్ల కష్టాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube