తులసి మొక్కను ఇలా పూజించారంటే.. ఆర్థిక సమస్యలలో చిక్కుకోవడం ఖాయం..!

మన దేశంలో చాలామంది ప్రజలు తమ ఇళ్లలో తులసి మొక్కను( Holy Basil ) కచ్చితంగా పెంచుకుంటూ ఉంటారు.

ఎందుకంటే సనాతన ధర్మం ప్రకారం ఈ మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.

తులసి మొక్క ఉండే ఇంటిలో ఎప్పుడు ప్రతికూల శక్తులు ఉండవు అని చాలామంది ప్రజలు నమ్ముతారు.దీనితో పాటు విష్ణువు( Vishnu ) మరియు తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందని చెబుతూ ఉంటారు.

అందుకే తులసి మొక్కను ఎప్పుడూ పూజిస్తూ ఉంటారు.కానీ చాలా సార్లు తులసిని పూజించేటప్పుడు వారు కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు.

దానివల్ల వారు పూజించిన పూర్తి ఫలితాన్ని అసలు పొందలేరు.తులసి మొక్కకు ఎప్పుడు నీరు సమర్పించాలో చాలామందికి తెలియదు.తులసికి ఏ సమయంలో నీరు సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా చెప్పాలంటే సూర్యోదయ సమయం( Sunrise time )లో తులసి మొక్కకు నీరు సమర్పించడం మంచిది అని పండితులు( Scholars ) చెబుతున్నారు.అందుకే స్నానం చేసిన తర్వాత సూర్యోదయ సమయంలో తులసికి నీళ్లు సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఎప్పుడూ ఉంటాయి.అలాగే ఆర్థిక సంక్షోభం( Financial crisis ) నుంచి త్వరగా బయటపడవచ్చు.

తులసికి ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు సమర్పించకూడదు.చాలామందికి వారంలో ప్రతి రోజు తులసి మొక్కకు నీళ్లు అందించడం అలవాటుగా ఉంటుంది.కానీ ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు.

అంతేకాకుండా ఏకాదశి రోజున ( Ekadashi (కూడా తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు.ఎందుకంటే ఈ రోజున తల్లి తులసి విష్ణువు కోసం నీరు లేని ఉపవాసం ఆచరిస్తూ ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తులసి మొక్కను నిత్యం పూజించడం వల్ల విశేష ఫలితాలను పొందవచ్చు.శుభ్రమైన రాగి లేదా వెండి పాత్రలో నీటిని తీసుకొని తులసి మొక్క అడుగున భక్తితో నెమ్మదిగా సమర్పించాలి.

Advertisement

అదే సమయంలో తులసి మొక్క మంత్రాన్ని చదువుతూ ఉండాలి.

తాజా వార్తలు