అధికమాసం పూర్తి అయిన తర్వాత శుద్ధ శ్రావణమాసం ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ శుక్రవారం వరకు ఉంటుంది.ఈ స్వచ్ఛమైన శ్రావణమాసంలో( Shravanamasam ) వివిధ పండుగలను జరుపుకుంటారు.
శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శ్రావణ మాసం శుభప్రదమైన మాసం.
మనకు ఉన్న 12 మాసాల్లో ఒక్కోరోజు ఒక్కో విశిష్టత ఉంటుంది.ముఖ్యంగా ఈ మాసంలో మహిళలు తమ సౌభాగ్యం కోసం వర మహాలక్ష్మి పూజలు( Vara Mahalakshmi Pooja ) చేస్తారు.
పూజలు నోములు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
శ్రీమన్నారాయుణుడు శ్రావణ నక్షత్రంలో జన్మించాడు.
ఇది చాలా ప్రత్యేకమైన నక్షత్రం.ఈ నక్షత్రంలో పుట్టిన వారు వివేకవంతులు, గొప్ప పాండిత్యం కూడా లభిస్తుంది.
నారాయణుడి మాసం కాబట్టి ఈ మాసంలో చంద్రుడు ఈ నక్షత్రం దగ్గర సంచరిస్తాడు.కాబట్టి ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది.
ఈ మాసంలోనే హయాగ్రీవుడు, శ్రీకృష్ణుడు కూడా జన్మించాడు.అలాగే అనేక విశేష పండుగలు ఈ మాసంలో ప్రజలు జరుపుకుంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు 1వ తేదీన పురుషోత్తమ పౌర్ణమి( Purushottama Pournami ) నుంచి సనాతన ధర్మంలో పండగల శ్రేణి మొదలైంది.ఇది కార్తీక మాసం వరకు ఉంటుంది.

నాగ పంచమిని( Naga Panchami ) ఆగస్టు 21వ తేదీన, రక్షాబంధన్( Raksha Bandhan ) ఆగస్టు 30వ తేదీన జరుపుకుంటారు.దీనితో పాటు గ్రహాల కూటమి యోగ ప్రత్యేకమైన కలయిక కూడా ఆగస్టు మొత్తంలో ఏర్పడుతుంది.ఐదు రోజులు రవి యోగం ఉంటుంది.అదే ఐదు రోజులు సర్వసిద్ధి యోగం, మూడు రోజులు సిద్ధి యోగం, ఒకరోజు ప్రజాపతి యోగం రెండు రోజులు వర్తమాన యోగం, మూడు రోజులు గజకేసరి యోగం ,రెండు రోజులు మహాలక్ష్మి యోగం, రెండు రోజులు బుధాదిత్య యోగం ఆగస్టులో ఉంటాయి.
అంతేకాకుండా శ్రావణమాసంలో మొదటి పండుగ గా నాగుల చవితిని జరుపుకుంటారు.

ఈ తిధి ఆగస్టు 20వ తేదీన రానుంది.అంతేకాకుండా గరుడ పంచమిని( Garuda Panchami ) ఆగస్టు 21వ తేదీన జరుపుకుంటారు.ఆగస్టు 25వ తేదీన శ్రావణ శుద్ధ నవమి రోజు వరమహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు.
వివాహమైన స్త్రీలు వరలక్ష్మి దేవిని భక్తితో పూజించి ఆయురారోగ్య, ఐశ్వర్యాలను ప్రసాదించాలని అమ్మవారిని కోరుతారు.ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు శ్రావణమాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజు జన్మించాడు.
అందుకే ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిగా ప్రజలు జరుపుకుంటారు.