ప్రస్తుత రోజులలో కూడా టెక్నాలజీ ఇంత పెరిగిన చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయడం, ఆడపిల్లల్ని( Girls ) చంపేయడం మనం చూస్తూనే ఉన్నాం.మగ పిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని, ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించే వారు చాలామంది ఉన్నారు.
ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది.ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మిదేవి పుట్టినట్టే అని మన పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు.
అది నిజమేనా ఎందుకు అలా చెబుతారు.అసలు ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది.
అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎలాంటి పనులు చేయడం వల్ల వారి ఇంటికి కూతురి వల్ల సంపదలు లభిస్తాయి అని అర్జునుడు అడుగుతాడు.అప్పుడు శ్రీకృష్ణుడు ( LORD KRISHNA )అర్జునుడికి ఇలా చెప్పాడు.ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వ జన్మలో ఎన్నో పుణ్య కార్యాలయాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు.
వారికి మాత్రమే తర్వాత జన్మలో ఆడపిల్లను పొందే అదృష్టం కలుగుతుంది.అలాంటి వారికే ఆడపిల్లకు తల్లిదండ్రులుగా ఉండే అదృష్టం దక్కుతుంది.వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అని చెబుతూ చెబుతాడు.వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు ఉంటుంది.
ఎవరైతే కూతురిని పెంచగల సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు.

ఒకసారి స్వామి వివేకానంద( Swami Vivekananda ) వైష్ణో దేవి దేవాలయం మెట్ల మీద వెళ్తున్నారు.అప్పుడు ఆయన పక్కనే ఒక రైతు తన కూతురిని భుజం మీద కూర్చోబెట్టుకుని మెట్లు ఎక్కుతున్నాడు.అది చూసిన వివేకానంద అతనిని అడిగారట ఎందుకు మీరు మీ కూతురి భారాన్ని మోస్తున్నారు.
అప్పుడు రైతు కూతురు ఎప్పుడూ తండ్రికి భారం కాదు.వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తేలికైపోతుంది.
కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు.పురాణాల ప్రకారం ఎవరైతే తన గత జన్మలో స్త్రీలతో ప్రవర్తించే తీరును బట్టి వారు మహిళలుగా పుడతారు.
ఎవరైతే చనిపోయే ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీ లుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి.ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయం అని పండితులు చెబుతున్నారు.