తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు బ్రహ్మానందం( Brahmanandam ) గురించి అందరికీ సుపరిచితమే ఒకప్పుడు వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన ప్రస్తుతం వయసు పైబడటంతో కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకొని నటిస్తున్నారు.గత కొద్ది రోజుల క్రితం రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి తనలో మరో కోణం కూడా ఉందని చూపిస్తూ ఈయన నటించిన తీరుకు ఎంతోమంది మంత్రముగ్ధులు అయ్యారు.
ఇలా బ్రహ్మానందం ఎన్నో అద్భుతమైన పాత్రలలో జీవించారనే చెప్పాలి.

బ్రహ్మానందం కుటుంబ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను( KCR ) మర్యాదపూర్వకంగా కలిశారు.బ్రహ్మానందం తన భార్య తన పెద్ద కుమారుడు గౌతమ్ కలిసి ప్రగతి భవన్ లో కేసీఆర్ దంపతులను కలిశారు.మరి కొద్ది రోజులలో బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ ( Siddharth ) వివాహం ( Marriage ) జరగనున్న నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికను( Weeding Invitation Card ) కెసిఆర్ దంపతులకు అందజేశారు.
అదేవిధంగా బ్రహ్మానందం స్వయంగా గీసినటువంటి శ్రీవారి చిత్రపటాన్ని కూడా కేసీఆర్ దంపతులకు కానుకగా అందజేశారు.ఈ క్రమంలోనే కెసిఆర్ తో కలిసి బ్రహ్మానందం కొంతసేపు పెళ్లి గురించి మాట్లాడుతూ వారిని మర్యాదపూర్వకంగా వివాహానికి ఆహ్వానించారు.

బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు మొదటి కుమారుడు గౌతమ్( Gautham ) అందరికీ సుపరిచితమే ఈయన ప్రముఖ వ్యాపారవేత్తగా బిజీగా ఉండగా హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు.ఇక చిన్న కుమారుడు సిద్ధార్థ్ ( Siddharth ) విదేశాలలో ఉద్యోగరీత్యా అక్కడే స్థిరపడ్డారు.ఇక తన చిన్న కుమారుడు సిద్ధార్థ్ కి ( Siddharth) ఐశ్వర్య ( Aishwarya ) అమ్మాయితో మే 21వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది.ఇక బ్రహ్మానందం చిన్న కోడలు కూడగొప్ప డాక్టర్ అనే విషయం మనకు తెలిసిందే.
అయితే మేలో నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.ఈ క్రమంలోనే బ్రహ్మానందం తన చిన్న కుమారుడి పెళ్లికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తూ పెళ్లి పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.