తథాస్తు దేవతలు అంటే ఎవరు? నిజంగానే ఇలాంటి దేవతలు ఉన్నారా? అని పలుమార్లు మనకు సందేహం కలుగుతోంది.సంధ్యా సమయాల్లో పొరపాటున చెడును శంకించే మాటలు మాట్లాడుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు తథాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తుంటారు.
అసలు ఈ తథాస్తు దేవతలు ఎవరు? వారి గురించి ఇక్కడ తెలుసుకుందాం…
తథా అంటే ఆ విధంగా లేదా ఆ ప్రకారంగా, ఆస్తు అంటే కావలసినది అని అర్థం.మీరు అనుకున్నది ఆ ప్రకారంగా జరుగుతుంది అని అర్థం.
సాయంత్రం వేళల్లో తథాస్తు దేవతలు ఉంటారని మన నమ్మకం.అందువల్ల మన మనస్సు ఎప్పుడూ కూడా మంచి జరగాలని ఆశిస్తే మనకు మంచే జరుగుతుంది.
అలా కాకుండా కీడు జరుగుతుందేమో అని భయపడటం, లేదా ఎక్కువ సార్లు చెడు ఆలోచనలు మన మనసులో మెదులుతూ ఉన్నప్పుడు చెడు జరుగుతుంది.తథాస్తు దేవతలు తథాస్తు అనడం వల్ల ఇలా జరుగుతుంది.
అందుకోసమే ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు మాత్రమే చేయాలి.
ఎవరి దగ్గరైతే ఎక్కువగా ధనము కలిగి ఉండి, సంతోషంగా వారి జీవితం గడుపుతూ, బయటకు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా దగ్గర డబ్బు లేదు అని పదే పదే అంటూ ఉంటారు.
అలా అనడం వల్ల తథాస్తు దేవతలు ఆశీర్వాదం వల్ల వారికి ధన నష్టం కలిగి తీవ్ర ఇబ్బందులు పడతారు.అందువల్ల మనం మాట్లాడే ప్రతి మాట కూడా అనుకూలంగా ఉండాలి.
ఎలాంటి పరిస్థితుల్లో కూడా చెడు శంకించే మాటలు మాట్లాడకూడదు అని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.
మనం ఏదైనా కోరుకున్నప్పుడు లేదా కావాలనుకున్నప్పుడు ఇతరులు మనల్ని ఉద్దేశించి తధాస్తు అని సంబోధిస్తూ ఉంటారు.
అంటే దానికి అర్థం మనం కోరుకున్నది కచ్చితంగా జరుగుతుందని అర్థం.అంతే కాకుండా ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు తథాస్తు అని చెప్పడానికి గల కారణం.
ఆ కార్యం మీరు అనుకున్న విధంగా జరుగుతుంది అని అర్థం.దీనినే తధాస్తు అని అంటారు.
అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ధర్మ విరుద్ధంగా కాకుండా, ఎంతో సానుకూలతను కలిగి ఉండాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు.