కేశ సంరక్షణలో, సౌందర్య సాధనలో మాత్రమే కాదు.ఆరోగ్యానికి కూడా కొబ్బరి నూనె ఎంతో మేలు చేస్తుంది.
అందుకే చాలా మంది కొబ్బరి నూనెను వంటల్లో వాడుతుంటారు.ముఖ్యంగా కేరళ ప్రజలు వంటలకు కొబ్బరి నూనెనే యూజ్ చేస్తారు.
కొబ్బరి నూనెలో కాల్షియం, ఐరన్, జిండ్, విటమిన్ ఇ, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.అందుకే కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు.
ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నూనెను తాగితే.బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో కొబ్బరి నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది.మధుమేహం వ్యాధి గ్రస్తులు ప్రతి రోజు పరగడుపున ఖాళీ కడుపుతో ఒక స్పూన్ కొబ్బరి నూనెను తీసుకుంటే.
సహజంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
బరువు తగ్గించడంలోనూ కొబ్బరి నూనె ఉపయోగపడుతుంది.ఉదయాన్నే ఒకటి, రెండు స్పూన్ల కొబ్బరి నూనె తాగితే.శరీరంలో కొవ్వు కరుగుతుంది.
అధిక ఆకలి సమస్య దూరం అవుతుంది.దాంతో వెయిట్ లాస్ అవుతారు.
కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
అలాగే ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె తీసుకుంటే.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
తద్వారా గుండె పోటు మరియు గుండె సంబంధిత జబ్బులు దరి చేరకుండా ఉంటాయి.
ఈ మధ్య కాలంలో కిడ్నీ స్టోన్స్ ఎందరినో వేధిస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ప్రతి రోజు పరగడుపున కొబ్బరి నూనె తీసుకుంటే.మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
ఉదయాన్నే కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల ముడతలు, పగుళ్లు తగ్గి చర్మం ఎల్లప్పుడూ మృదువుగా, యవ్వనంగా ఉంటుంది.ఇక కొబ్బరి నూనెను తాగడం వల్ల జుట్టు కూడా ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది.