వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విగ్రహం మీ ఇంట్లో ఉంటే అన్ని శుభాలే!

సాధారణంగా మనం ఎన్నో శాస్త్రాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతగానో నమ్ముతాను.ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం ఏ చిన్న పని చేసినా కానీ లేదా ఏ చిన్న నిర్మాణం చేపట్టిన కానీ ఎన్నో మంచి ఫలితాలు పొందుతామని భావిస్తారు.

 According To Vastu If This Idol Is In Your House All Luck For You Details, Vast-TeluguStop.com

ఈ క్రమంలోనే ఏదైనా ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ఎంతో అనుభవం కలిగిన వాస్తుశాస్త్ర నిపుణులను సందర్శించి వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతాము.అయితే కొన్నిసార్లు మన ఇంటికి వాస్తు లోపం ఉండటం వల్ల అనేక సమస్యలు మనల్ని వెంటాడుతుంటాయి.

ఇలాంటి సమయంలోనే వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కొన్ని పరిహారాలు చేస్తారు.అలాంటి పరిహారాలలో ఒకటే ఈ అరోవానా చేప విగ్రహం.

ఈ చేపను ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు లేకుండా ఉంటాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.అయితే ఈ చేపలు అక్వేరియంలో ఇంటిలో ఉంచుకోవడం వల్ల మన ఇంటిలో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.

అయితే ఈ చేపలు ఎక్కువ కాలం జీవించక పోవటం వల్ల చాలామంది ఈ చేపలతో విగ్రహాలను తయారు చేయించుకుని ఇంటిలో ఉంచుకుంటారు.మన ఇంట్లో ఏర్పడిన దుష్టశక్తులను తొలగించడానికి అరోవానా చేప ఒక మంచి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.

Telugu Aquarium, Hindu, Idol, Luck, Vasth Tips, Vasthu, Vasthu Tips, Worship-Tel

అరోవానా చేప విగ్రహాన్ని ఇంటిలో ఉంచుకోవాలి అనుకునేవారు తప్పనిసరిగా చేప నోటిలో ఒక నాణెం ఉండేలా తయారు చేయించుకోవాలి.ఇలాంటి విగ్రహం ఇంటిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు లేకుండా ఇల్లు మొత్తం ఎంతో అనుకూల వాతావరణాన్ని ఏర్పడి ఉంటుంది.ఈ చేప ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే ఈ చేప ప్రకృతిలో వచ్చే మార్పులను తొందరగా పసిగట్టగలదనీ చెప్పవచ్చు.భూకంపం వంటి ప్రమాదాలు సంభవించే సమయంలో ఈ చేపలు ముందుగా గ్రహించి సంకేతాలను తెలియజేస్తాయి కనుక చాలా మంది వీటిని విగ్రహం కన్నా జీవించి ఉన్న చేపలను ఆక్వేరియంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube