ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కలకలం..నీటిలో నుండి పూర్తిగా బయటపడిన సంగమేశ్వర గోపురం..

యాదాద్రి దేవాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కలకలం రేపింది.ఈనెల 18వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 The Surrounding Areas Of This Temple Are Buzzing With Drones..the Sangameshwara-TeluguStop.com

పెద్ద గుట్ట నుంచి యాదాద్రి దేవాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఆపరేట్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు కనిపించారు.అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా దేవాలయం ఏరియాలో డ్రోన్ కెమెరాను పంపి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వీడియో షూట్ చేస్తు ఇద్దరు యువకులు కనిపించారు.

ఇంకా చెప్పాలంటే దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు చందు, నిఖిలేష్ అనే నిందితులను గుర్తించారు.ఆ తర్వాత ఆ ఇద్దరి పై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్నటు వంటి డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇంకా చెప్పాలంటే శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో సంగమేశ్వర దేవాలయ శిఖరం బయటపడింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న సంగమేశ్వరాలయం కృష్ణా నదిలో నాలుగు నెలల క్రితం మునిగిపోయింది.అప్పటినుంచి నీటిలో ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 863 అడుగులకు చేరుకోవడంతో దేవాలయ గోపురం పూర్తిగా బయటపడింది.దీనివల్ల దేవాలయ పూజారి రఘురామ శర్మ బోటులో వెళ్లి సంప్రదాయం ప్రకారం పూజలు చేసి శిఖరం పై జెండాను ఎగురవేసి వచ్చారు.

జలాశయంలో మరో 24 అడుగుల నీటిమట్టం తగ్గితే సంగమేశ్వర దేవాలయం పూర్తిగా బయటపడే అవకాశం ఉంది అని కూడా చెప్పారు.అందుకోసం ఫిబ్రవరి రెండో వారం వరకు ఎదురు చూడవలసి ఉంటుంది.

సంగమేశ్వర దేవాలయం నీటిలో నుండి బయటపడి భక్తులు వచ్చి కన్నుల పండుగగా మారాలంటే ఇంకో రెండు నెలలు వేచి ఉండాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube