అంతర్ రాష్ట్ర గంజాయి రవాణా ముఠా సభ్యులను తెలంగాణ రాష్టం ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మీడియా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ వివరాలు వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం నగర ఏసీపీ అంజనేయులు ఆధ్వర్యంలో ఖమ్మం టూ టౌన్ సిఐ శ్రీధర్ తన సిబ్బందితో కలిసి ఖమ్మం నగరంలోని బుర్హన్ పూరం సమీపంలో ఖాళీ ప్రదేశంలో ఉంచిన ట్రాక్టర్ లో నిల్వ వుంచిన గంజాయి నీ రాజస్థాన్ తరలించేందుకు ఈరోజు తెల్లవారుజామున లారీలో లోడు చేస్తున్న క్రమంలో దాడి చేసి పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు.
ఒరిస్సా రాష్ట్రం నుండి రాజస్థాన్ కు తరలించేందుకు గంజాయి రవాణా ముఠా వాటిని నిల్వ చేసినట్లు పట్టుబడ్డ నిందుతులు విచారణలో వెల్లడించారని కమిషనర్ తెలిపారు.
ముఠా లోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేసి,వారి వద్ద నుంచి 75 లక్షల విలువ చేసే 255 కేజీల గంజాయి , ఏడు లక్షల ఇరువై వేల రూపాయల నగదుతో పాటు మూడు వాహనాలు ఒక లారీ , 2 ట్రాక్టర్ లను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు .ఒరిస్సా రాష్ట్రం నుండి రాజస్థాన్ రవాణా చేస్తున్నట్లు పట్టుబడ్డ వారిలోరాజస్థాన్ రాష్టంలోని రాజస్థాన్ మండి మండలం బంజారా కాకెడ గ్రామనికి చెందిన బంజార బాబులాల్, బంజారా మిత్తు లాల్, బంజారా గోరులాల్ లతో పాటు తెలంగాణ రాష్టంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొత్త పల్లి రాజు ఉండగా మహాబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బొడ అమ్ము తండా గ్రామానికి చెందిన గుగులోత్ బాబులాల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దుల మీదుగా గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు పకడ్బందీ .చర్యలు చేపట్టినట్లు , అందులో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయి తరలింపు మూలాలను పసిగట్టే పనిలో వున్నాయని తెలిపారు .నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించినసీసీఎస్ పోలీసులతో పాటు, ఖమ్మం టూ టౌన్ పోలీసులను కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అభినందించారు.