నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ రోడ్డు నందు గల ముగ్ధ వస్త్ర షో రూమ్ లో సినీనటి పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ప్రముఖ వస్త్ర ప్రపంచం ముగ్ధ షోరూం ను నెల్లూరు నగరంలో ఘనంగా ప్రారంభించారు.
ముగ్ధ వస్త్ర షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ నటి పాయల్ రాజ్ పుత్ రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను అట్టహాసంగా ప్రారంభించారు.ముగ్ధ వస్త్ర షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తుందని, అనేక రాష్ట్రాలలో వస్త్ర ప్రపంచంలో రారాజుగా నిలిచిన ముగ్ధ వస్త్ర షోరూం నెల్లూరు నగరంలో దినదినాభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.