ప్రస్తుతం దేశ రాజకీయాలలో వందేళ్ళకి పైగా చరిత్ర కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొంటుంది.కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకుడు లేకపోవడం ఇప్పుడు రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలలో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసారు.ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పిన రాహుల్ గాంధీ మాత్రం తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అద్యక్ష స్థానం కోసం ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్తే అధ్యక్ష పగ్గాలు ప్రియాంకా గాంధీకి అప్పగించడం కోసం రాజకీయ పార్టీలో చర్చ నడుస్తుంది.
అయితే ప్రియాంకకి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కుదుట పడుతుంది అని, రానున్న ఎన్నికలకి బలంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్తుంది అనే మాట వినిపిస్తుంది.అయితే ఇదే విషయం ప్రియాంకా ద్రుష్టికి వెళ్ళడంతో ఆమె తాను కాంగ్రెస్ పార్టీ భారం మోయలేనని చేతులెత్తేసినట్లు తెలుస్తుంది.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని నడిపించాలంటే తలకు మించిన భారం అవుతుందని ఆమె పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలుస్తుంది.