వయసు ఎంత పెరిగినా పాతికేళ్ల కుర్రాడిలా యువ హీరోలకు మంచి పోటీని ఇస్తోన్న అక్కినేని నాగార్జున నెక్స్ట్ మన్మథుడు 2 సినిమాతో రెడీ అవుతున్నాడు.ఆగస్ట్ లో సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే సంక్రాంతి ని టార్గెట్ చేసి ఒక సినిమా చేద్దామనుకున్న నాగ్ ప్లాన్ రివర్స్ అయ్యింది.

అనుకోని విధంగా బంగార్రాజు సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయ్యింది.ఇంకా సెట్స్ పైకి రాని ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ను ఇప్పటికే మొదలుపెట్టాల్సింది.కానీ స్క్రిప్ట్ పై అనుమానాలతో నాగ్ రీ చెక్ చేయించేసరికి అలస్యమయ్యింది.
అదే విధంగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సోదరుడు చనిపోవడంతో స్క్రిప్ట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
కళ్యాణ్ ఆ బాధ నుంచి కొలుకున్నాక నాగ్ ని కలవనున్నాడు.
బంగార్రాజు రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వాలంటే ఇంకాస్త సమయం పడుతుంది.మన్మథుడు 2 రిలీజ్ తరువాత నాగ్ ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడట.
అయితే ఎలాగైనా ఆ ప్రాజెక్టును సమ్మర్ లొనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.







