ఈటెలకు మద్దతివ్వడానికి తటపటాయిస్తున్న నేతలు...ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాలలో గత 20 సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించిన ఈటెల రాజేందర్ తాజాగా భూ కబ్జా వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అయితే ఈటెలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో కలకలం రేగింది.

 Leaders Not Showing Interest To Support Etela Rajendar, Etela Land Grabbing Alle-TeluguStop.com

అయితే గత సంవత్సరం కాలంగా ఈటెల తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పెద్దగా ఒరిగేది ఏమీ లేదని పేదరికం ఈ పథకాలతో తుడిచి పెట్టుకపోదని ఏకంగా ప్రభుత్వ పథకాలపైనే సంచలన వ్యాఖ్యలు చేసారు.

అయితే అప్పటి నుండి ఈటెలపై కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఎప్పటి నుండో వ్యాఖ్యలు వినిపించాయి.అయితే తాజాగా కేసీఆర్ ఈటెల భూ కబ్జా వ్యవహారంపై విచారణ వేయడంతో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం ఈటెల కు తొలుత అధిక సంఖ్యలో పలు సంఘాల నాయకులు మద్దతిచ్చారు.

కాని ఆ తరువాత ఈటెల భూ కబ్జా వ్యవహారం నిజమేనని కలెక్టర్ సైతం ధ్రువీకరించడంతో ఇప్పుడు ఈటెల మద్దతుగా నిలిచిన నేతలు తటపటాయిస్తున్న పరిస్థితి నెలకొంది.ఒక వేళ నిజమే అని తేలితే అక్రమ వ్యవహారానికి మద్దతిచ్చామనే పేరు వస్తుందని అంతర్గతంగా చర్చించుకున్నట్టు సమాచారం.

మరి ఈటెల నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube