గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది.జూన్ 11వ తేదీన టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ క్రమంలో లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది.
అనంతరం పిటిషన్ ను రేపు విచారిస్తామని డివిజన్ బెంచ్ తెలిపింది.అయితే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని, అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్ తీసుకోలేదని, నిబంధనలు పాటించకుండా పరీక్షను నిర్వహించారని పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం గ్రూప్ -1 పరీక్షను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.