మానవ జీవితంలో శృంగారం అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ శృంగారం మానసిక, శారీరక సుఖమే కాకుండా మరో కొత్త జీవానికి కూడా నాంది పలుకుతుంది.
అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు మరియు ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలామంది శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేక పోతున్నట్లు కొందరు వైద్య నిపుణులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడించారు. సాధారణంగా ఎక్కువ మంది శారీరక సుఖం కోసం శృంగారంలో పాల్గొంటారు.
కానీ పెళ్లయిన దంపతులు మాత్రం సంతానం కోసం శృంగారంలో పాల్గొంటారు.అయితే ఈ క్రమంలో కొంతమంది దంపతులు పెళ్లయిన తర్వాత రోజులో ఎక్కువ సమయం శృంగారంలో పాల్గొంటే తొందరగా సంతానం కలుగుతుందని భ్రమలో ఉండి రోజుకి రెండు,మూడు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు.
కానీ అలా చేయడం సరికాదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.అంతేకాక రోజూ శృంగారం చేయడం వల్ల వీర్యకణాల సామర్థ్యం రోజురోజుకి తగ్గిపోతుందని అందువల్ల సంతానం కలిగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే శృంగారంలో తరచూ కాకుండా వారానికి రెండు లేదా మూడు సార్లు పాల్గొంటే వీర్యకణాల సామర్థ్యంతో పాటు సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని పలు ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేశారు.అంతేకాక సంతానం కలిగే ప్రక్రియలో వీర్యకణాల సామర్థ్యం ముఖ్యపాత్ర పోషిస్తుందని కాబట్టి వీర్యకణాల సామర్థ్యం పెరగాలంటే బలమైన ఆహారం తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
అయితే పెళ్ళికాని యువతీ, యువకులు శృంగారంలో పాల్గొనడం ద్వారా పలు సమస్యలను ఎదుర్కొంటారని ఇందులో ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఒత్తిడి వంటి వాటికి గురవుతారని కాబట్టి పెళ్లికి ముందు శృంగారానికి దూరంగా ఉంటే మంచిదని కొంత మంది వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అలాగే తమకి ఇష్టమైన వారిని మరియు జీవిత భాగస్వాములను తరచూ ముద్దు పెట్టుకోవడం మరియు కౌగిలించుకోవడం వంటివి చేయడంవల్ల తమ అనుకున్నవారికి నమ్మకం మరింత పెరుగుతుందని, అంతేకాక పలు మానసిక రుగ్మతలు కూడా తొలగి పోతాయని ఇదివరకే వైద్య నిపుణులు అధికారికంగా నిరూపణ చేశారు.