చిన్నప్పటి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా...?

తెలుగులో ప్రముఖ దర్శకుడు దశరథ్ దర్శకత్వం వహించిన టువంటి “శ్రీ” అనే చిత్రంలో మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

 Tamanna, Tollywood Actress, Thamanna Childhood Photos, Social Media, Seetimar Mo-TeluguStop.com

దాంతో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన “హ్యాపీడేస్” అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అవ్వడంతో  ప్రస్తుతం వరుస స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.

అయితే ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నాకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలు తమన్నా చిన్నప్పటి ఫోటోలు కావడంతో  తమన్నా చిన్నప్పుడుచాలా క్యూట్ గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అంతేగాక తమన్నా అభిమానులుఈ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో తమన్నా ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నటువంటి “సిటీమార్” అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో ఈ అమ్మడు ప్రముఖ కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో నటిస్తోంది.అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పొందాయి.కాగా బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ప్రముఖ దర్శకుడు నవాబు సిద్ధికి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో ఈ చిత్రానికి సంబంధించి నటువంటి షూటింగ్ పనులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube