ఈ మహిళను చెప్పుతో కొట్టి.. జుట్టు కత్తిరిస్తే.. పోలీసులు ఏం చేస్తున్నారు?

ఏపీలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలపై సుమారు 650 దాడులు జరిగినట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.తాజాగా అలాంటి మరో ఘటనపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

 Chandrababu Naidu Comments On Appolice-TeluguStop.com

ప్రస్తుతం అనంతపురం జిల్లా మూడు రోజుల పర్యటనలో ఉన్న బాబు.రెండోరోజు వైసీపీ దాడులకు గురైన టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

Telugu Chandrababu, Chandrababu Ap, Ycp Chandrababu-

ఈ సందర్భంగా ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడారు.జగన్‌ ఉన్మాదిగా మారారని, అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి వీల్లేదని బాబు అన్నారు.రాప్తాడు నియోజకవర్గానికి చెందిన అలవేలమ్మ అనే మహిళతో వైసీపీ కార్యకర్తలు వ్యవహరించిన తీరుపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓ వైపు రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చానని చెబుతున్న జగన్‌.

ఇలా మహిళలపై నడిరోడ్డుపై జరిగిన దారుణాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

అలవేలమ్మను నడిరోడ్డుపైనే చెప్పులతో కొట్టి ఈడ్చుకుంటూ వెళ్లి జుట్టు కత్తిరించి దారుణంగా అవమానించారు.

ఈ ఘటనపై టీడీపీ నేతలు డీఎస్పీని కలిసి ఫిర్యాదు కూడా చేశారు.అయితే ఈ దౌర్జన్యానికి పాల్పడిన వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో వాళ్లు ఇప్పటికే స్వేచ్ఛగా బయటే తిరుగుతున్నారు.ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

Telugu Chandrababu, Chandrababu Ap, Ycp Chandrababu-

ఓ మహిళ పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.దిశ చట్టం తీసుకురావడం కాదు.ఈ దౌర్జన్యానికి పాల్పడిన వాళ్లపై ఎలాంటి చర్యలకు ఆదేశించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా వైసీపీ దాడులతో నష్టపోయిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు.

అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇలా చేసి ఉంటే.వైసీపీ అసలు ఉండేదా అంటూ ప్రశ్నించారు.

తప్పుడు కేసులు బనాయించే అధికారులు జాగ్రత్తగా ఉండాలని, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైరైనా కూడా అలాంటి వాళ్లను వదలబోనని హెచ్చరించారు.టీడీపీ వాళ్లు పెంచుకున్న కుక్క కరిస్తే 15 కేసులు పెడతారా? కరెంటు స్తంభాలకు వైసీపీ రంగులు వేస్తుండటాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ పోలీసులను ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube