ఈ ఏడాది పితృ పక్షాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.ఈ రోజు నుంచి 15 రోజులను పితృ పక్షాలు అంటారు.
ఈ పదిహేను రోజులలో మన పూర్వీకులకు మన పెద్ద వారి ఆత్మ శాంతించాలని వారికోసం ఒక రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి వారికి తర్పణం వదలడం వల్ల మనపై ఏ విధమైనటువంటి పితృ దోషాలు ఉండవు.అదేవిధంగా పూర్వీకులకు తర్పణలు వదిలి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే….
నల్ల నువ్వులు:

మన పెద్ద వారికి తర్పణం వదిలిన రోజు ఇతరులకు నువ్వులను దైవభక్తితో దానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా విపత్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోబడతామని పండితులు చెబుతున్నారు.అందుకోసమే తర్పణం వదిలే సమయంలో కూడా అన్నంలో నల్లనువ్వులను కలుపుతారు.
వెండి వస్తువులు:

మన పెద్దలకు తర్పణం వదిలిన రోజు ఏ చిన్నపాటి వెండి వస్తువునైనా ఇతరులకు దానం చేయడం వల్ల మన పూర్వీకులకు ఆత్మశాంతి కలిగి వారి ఆశీస్సులు మనపై ఉంటాయి.వెండి చంద్రునికి సంబంధించినది కనుక శ్రాద్ధలో పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడం కోసం వెండిని దానం చేయాలని చెబుతారు.
వస్త్రాలు:

పితృ పక్షాలు సమయంలో మన పూర్వీకులకు తర్పణం వదిలిన రోజు వస్త్రాలను దానం చేయడం ఎంతో శుభసూచకం.మన పూర్వీకుల పేరిట వస్త్ర దానం చేయడం వల్ల పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు.