మెదడు.మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం.
శరీరం లోపల జరిగే అన్ని కార్యకలాపాలను నియంత్రించే మెదడును ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి.ఈ విషయం అందరికీ తెలుసు.
అయినప్పటికీ మెదడు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహిస్తుంటారు.దాంతో మెదడు పని తీరు నెమ్మదిస్తుంది.
ఫలితంగా ప్రస్తుత టెక్నాలజీ యుగంలో గెలవలేక, కోరుకున్న రంగంలో నిలబడలేక తీవ్రంగా మదన పడుతుంటారు.అయితే మీ బ్రెయిర్ షార్ప్ గా మారాలంటే ఇప్పుడు చెప్పబోయే నాలుగు అలవాట్లను తప్పకుండా వదిలించుకోవాలి.
మరి లేటెందుకు ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం పదండీ.
నిద్రను నిర్లక్ష్యం చేయడం.
నేటి తరం యువతలో చాలా మందికి ఉన్న కామన్ అలవాటు ఇది.నిద్ర సమయంలోనూ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వంటి గడ్జెట్స్ లో మునిగితేలుతుంటారు.ఇదే క్రమంగా కొనసాగితే నిద్రలేమి సమస్య ఏర్పడి.మెదడు చురుకుదనం దెబ్బతింటుంది.అందుకే ఇకపై అయిన నిద్రను నిర్లక్ష్యం చేసే అలవాటును వదిలించుకోండి.కంటి నిండా నిద్ర ఉంటే.
మెదడు దానికదే షార్ప్‌గా మారుతుంది.

ధూమపానం, మద్యపానం.ఫ్యాషన్ పేరుతోనూ, ప్రేమించిన వారు దూరమయ్యారనో లేదా ఇతరితర కారణాల వల్ల వీటికి అలవాటు పడుతుంటారు.మెదడు ఆరోగ్యం దెబ్బతినడానికి ఈ చెడు అలవాటు కూడా ఒక కారణం.
అందువల్ల, ఎవరైతే తమ బ్రెయిన్ చురుగ్గా మారాలని భావిస్తున్నారో.వారు తప్పకుండా మద్యపానం, ధూమపానం వంటివి మానేయాలి.
ఒత్తిడి.నేటి కాలంలో కోట్లాది మందిని వేధిస్తోంది.
అయితే చిన్న చిన్న విషయాలకు కూడా ఒత్తిడిని పెంచుకునే అలవాటు ఉంటే మెమరీ పవర్ క్రమంగా తగ్గిపోతుంది.అందుకే వీలనైంత వరకు ఒత్తిడికి దూరంగా ఉండండి.
అందుకోసం యోగా, ధ్యానం వంటి వాటిని ఎంచుకోండి.బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం.
మెదడు పనితీరు మందగించడానికి ఇదీ ఒక ముఖ్య కారణం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తేనే శరీరానికి మరియు మెదడుకు అవసరం అయ్యే శక్తి లభిస్తుంది.
పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.బ్రెయిన్ షార్ప్‌గా పని చేస్తుంది.
కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ ను పొరపాటున కూడా స్కిప్ చేయరాదు.