ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెబ్ బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది గూగుల్ క్రోమ్ వినియోగిస్తున్నారు.అయితే యూజర్లకు క్రోమ్ వినియోగంలో కొన్ని సమస్యలు ఉన్నాయి.అందులో ప్రధానమైనది బ్యాటరీ డ్రెయిన సమస్యగా చెప్పొచ్చు.క్రోమ్ వినియోగదారులు చాలా కాలంగా బ్యాటరీ డ్రెయిన్ గురించి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.ఇప్పటి వరకు, గూగుల్ సంస్థ సమస్యను పరిష్కరించలేకపోయింది.అయితే కొత్త క్రోమ్ బిల్డ్ బ్రౌజర్ వల్ల బ్యాటరీ డ్రెయిన్ సమస్యను తగ్గించడంలో సహాయపడే సాధనాన్ని పొందడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.
క్రోమ్ తాజా వెర్షన్ సెట్టింగ్‌లలో కొత్త పనితీరు పేజీని పొందవచ్చు.క్రోమ్ తాజా వెర్షన్ ద్వారా మెమరీ-సేవర్, ఎనర్జీ-సేవర్ మోడ్‌లను కూడా పొందవచ్చని తెలుస్తోంది.
క్రోమ్ యూజర్లు తరచుగా ఉపయోగించని అన్ని ట్యాబ్‌లను తాత్కాలికంగా ఆపివేయాలి.దీని వల్ల మీ పర్సనల్ కంప్యూటర్లలో RAM వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.ఎనర్జీ సేవర్ మోడ్‌తో, ఇది గ్యాడ్జెట్ నుండి తమ శక్తిని ఆదా చేసుకోవడానికి వినియోగదారులందరికీ సహాయపడుతుంది.ఈ కొత్త మోడ్ అధిక రిఫ్రెష్ రేట్లు, అదనపు విజువల్ ఎఫెక్ట్‌లను నిలిపివేస్తుంది.
ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీని పరిమితం చేస్తుంది.ఇలాంటి టూల్స్ ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు త్వరలో క్రోమ్ యూజర్లు కూడా ఈ సదుపాయాన్ని పొందగలుగుతారు.