మలబద్ధకంతో తరచూ బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

మలబద్ధకం( Constipation ).ఎంతో మంది అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.

చిన్న సమస్యగానే అనిపించినా.మలబద్ధకం అనేది చాలా ప్రమాదకరమైనది.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్త రోగాలను ఆహ్వానించినట్లే అవుతుంది.మలబద్ధకం కారణంగా కడుపు అసౌకర్యంగా ఎంతో ఇబ్బందిగా ఉంటుంది.

క్రమంగా నొప్పికి దారితీస్తుంది.అందుకే మలబద్ధకాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మీరు కూడా మలబద్ధకంతో తరచూ బాధపడుతున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే విషయాలు తప్పక తెలుసుకోండి.

జీర్ణవ్యవస్థ పనితీరు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో అప్పుడు మలబద్ధకం తలెత్తుతుంది.ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు.మన జీవన శైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా మలబద్ధకం సమస్యను తరిమికొట్టొచ్చు.

జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేయాలంటే ఫైబర్ ఎంత అవసరం.రోజుకు కనీసం ముప్పై గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.తృణధాన్యాలు, చిక్ పీస్, కిడ్నీ బీన్స్, చియా సీడ్స్( Chia seeds ) త‌దిత‌ర‌ ఆహారాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది.దాంతో ఏ రోజుకి ఆ రోజు జీర్ణాశయం, పేగులు శుభ్రపడతాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాగే మలబద్దకాన్ని తరిమి కొట్టడానికి పండ్లు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.ముఖ్యంగా యాపిల్, అవకాడో, అరటిపండు, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి జీర్ణ శక్తిని పెంచడానికి తోడ్పడతాయి.కాబట్టి రోజుకు రెండు రకాల పండ్లను కచ్చితంగా తీసుకోండి.

Advertisement

తరచూ మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు వాటర్ ను ఎక్కువగా తీసుకోవాలి.రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని సేవించాలి.

నార్మల్ వాటర్ తో పాటు వేడి నీటిని తాగడం కూడా ఎంతో అవసరం.ప్రతిరోజు ఉదయాన్నే రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని సేవించాలి.

ఇలా చేయడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయి.మలబద్ధకం దూరం అవుతుంది.

రోజుకు ఒక కప్పు పెరుగు కచ్చితంగా తీసుకోవాలి.పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థ( Digestive system )ను చురుగ్గా మారుస్తుంది.

ఇక మలబద్ధకంతో ఇబ్బంది ప‌డుతున్న‌ వారు నిత్యం 20 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.వ్యాయామం వల్ల మలబద్ధకం తో పాటు అనేక జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

తాజా వార్తలు