వెంటపడిన కుక్కలు.. ఈ సైక్లిస్ట్‌ ప్రాణభయంతో ఎలా అరిచేసాడో చూస్తే..

మనం జీవితంలో ఎప్పుడో ఒకసారి కుక్కలు ఛేజింగ్( Dogs Chasing ) ఫేస్ చేసే ఉంటాం.కొందరు ఏ వీధి కుక్కలను పట్టించుకోకుండా వెళ్ళిపోతే మరి కొంతమంది మాత్రం భయపడి చాలా వణికిపోతుంటారు.

 Stray Dogs Chasing Cyclist Video Viral On Social Media Details, Viral Video, Lat-TeluguStop.com

తాజాగా ఓ సైక్లిస్ట్‌ మాత్రం ప్రాణ భయంతో అరిచేశాడు.పైగా ఆ దృశ్యాలను వీడియోలు రికార్డ్ కూడా చేశాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో పోస్ట్ చేశాడు.అది ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆ వీడియోలో వీధికుక్కల గుంపు సైక్లిస్ట్‌ని( Cyclist ) వెంబడించడం మనం చూడవచ్చు.దీనిని సైకిలిస్టు స్వయంగా వీడియో రికార్డ్ చేశాడు.అతను ఆ కుక్కల నుంచి తప్పించుకున్నాడు.కానీ దానికి ముందు అతడు ప్రాణభయంతో అరిచేస్తూ చిన్న పిల్లోడిలాగా ప్రవర్తించాడు ఇది చూసి చాలామంది నవ్వుకుంటున్నారు అతడు ఎలాంటి కుక్క కాట్లకు గురి కాకుండా బయటపడ్డాడని తెలిసి మరి కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు.

ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు.సైకిల్పై వేగంగా ప్రయాణించడం వల్లే అతడు ఈ కుక్కల( Dogs ) నుంచి తప్పించుకోగలిగాడని కొంతమంది అన్నారు.“కుక్కలు మీకు కేలరీలు బర్న్( Calories Burn ) చేయడంలో సహాయపడుతున్నాయి” అని ఒకరు సరదాగా కామెంట్ చేశారు.“నాకు కుక్కలంటే భయం అందుకే” అని ఇంకొక వ్యక్తి అన్నాడు.

అసలు కుక్కలు బైక్‌లను, కార్లను ఎందుకు వెంబడిస్తాయి? సాధారణంగా కుక్కలకు వేట ప్రవృత్తి ఉంది.అవి కదులుతున్న వాహనాన్ని ఎరగా చూస్తాయి.బెదిరింపులకు గురైనప్పుడు ప్రజలను కూడా వెంబడిస్తాయి.కుక్కలు తామ నివసించే ప్రాంతంలోకి అపరిచితులు వస్తే కూడా ఇష్టపడవు.అందుకే వీధికుక్కలు తరచుగా చూసే వ్యక్తుల కంటే తమకు తెలియని వ్యక్తులను వెంటాడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube