గంటలు గంటలు ఏసీ గదిలో గడిపితే ఇలాగే ఉంటుంది.. తెలుసుకోండి ఇకనైనా!

ఒకప్పుడు కాస్త డబ్బు ఎక్కువ వున్నవారు ఎయిర్ కండీషనర్ కొనుక్కొనే వారు.ఇపుడు వారు వీరు అనే తేడా లేనేలేదు.

 Dangerous Side Effects Of Spending Too Much Time In Ac,air Conditioner, Ac,basi-TeluguStop.com

చాలామంది ఇక్కడ బడాయి కోసమే ఇలాంటి సదుపాయాలు కొనుక్కుంటున్నారు.అంతవరకూ బాగానే వుంది కానీ, కొంతమంది ఆన్ చేసిన ఏసీ ఎప్పుడు వాడుతారో వారికీ తెలియదు.

దాంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.అయితే ఎక్కువ సేపు ఏసీలో ఉండటం ప్రమాదకరమంటున్నారు వైద్యులు.

ఎండబారిన పడకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో… ఏసీతో కలిగే నష్టాలపై అవగాహన పెంచుకోవడం అంతే అవసరమని ఈ సందర్భంగా చెబుతున్నారు.
నేటి పరిస్థితులు మనిషిని రోజు రోజుకు సుకుమారంగా తయారు చేస్తున్న నేపథ్యంలో వాతావరణ మార్పులకు తట్టుకోవడం కష్టంగా మారుతోంది.

ఏసీ అనేది విపరీతమైన శారీరక శ్రమ నిస్సత్తువకు గురిచేయకుండా సౌకర్యం నివారిస్తుంది.చెమట పోయడం వంటి చికాకులకు చెక్ పెడుతుంది.అదే సమయంలో దీని వల్ల నష్టాలు లేకపోలేదు.ఏసి అతిగా వాడటం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు ఈక్రింది విధంగా ఉన్నాయి.

1.ఏసీపై పేరుకుపోయే ధూళి కారణంగా ఫంగస్, బాక్టీరియా వ్యాపించి ఎలర్జీలు వస్తాయి.

2.మరీ ముఖ్యంగా కంటి వ్యాధులున్న వారికి అంటే కాంటాక్ట్‌ లెన్స్ వినియోగిస్తున్నవారికి, ఆస్తమా రోగులకు ఏసీ ప్రమాదకారిగా మారుతోంది.

3.ఎక్కువ సమయం ACలో ఉండడం వల్ల ఆకస్మిక జలుబు, ముక్కు నుంచి నీరు కారడం, శ్యాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి:

Telugu Air, Air Temperature, Basic Ac, Ac, Ups-Telugu Health

1.ముఖ్యంగా AC అమరిక సరైన విధంగా ఉండాలి.

2.కేవలం వేసవిలో మాత్రమే వినియోగించడం ఉత్తమం.అయితే వాడే ముందు ఒకసారి టెక్నీషియన్‌కు చూపించడం మంచిది.

3.గది ఉష్ణోగ్రత మరీ చల్లగా కాకుండా 22 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి.గాలిలో సగటు తేమ శాతం 60 నుంచి 70 శాతానికి మధ్య ఉండాలి.

4.ఎక్కువగా ఏసీలో ఉండే వారికి ఎక్కువగా దాహం వేయదు.అలాగని మంచి నీరు తాగకుండా ఉండకూడదు.తగినన్ని నీళ్లు రోజు తాగుతూ ఉండాలి.

5.AC ఆటో ఆఫ్‌లో ఉండి గది ఉష్ణోగ్రతను సమాన స్థారులో ఉంచేదిగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube