కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ప్రతీ ఇండస్ట్రీకి పరిచయమే.ఈయన తమిళ్ లో రజనీకాంత్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని అక్కడ ప్రజల చేత సూపర్ స్టార్ గా పిలిపించు కుంటున్నాడు.
ఈయన సినిమా వస్తుంది అంటే ముందు నుండే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి.
అక్కడ ఈయన ప్రతీ సినిమా వంద కోట్లకు పైగానే రాబడుతుంది.
అయితే ఇప్పుడు విజయ్ తెలుగు ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాడు.ఇప్పటి వరకు డైరెక్ట్ తమిళ్ సినిమాలు చేసిన విజయ్ ఇప్పుడు బైలాంగ్విన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.
ప్రెజెంట్ టాలీవుడ్ డైరెక్టర్ తో విజయ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
తమిళ్ లో ‘వరిసు’ తెలుగులో వారసుడు పేరుతొ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు.
విజయ్ కెరీర్ లో తన 66వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

ఇక శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా షూట్ లో రష్మిక విజయ్ తో తీసుకున్న ఒక క్యూట్ సెల్ఫీ నెట్టింట మంచి వైరల్ అయ్యింది.ఈ సినిమా షూట్ జరుగుతుండగా ఈ సెల్ఫీ దిగినట్టుగా అనిపిస్తుంది.ఈ పిక్ లో విజయ్ మంచి హెయిర్ స్టైల్ తో ఆకట్టు కుంటుంటే.రష్మిక మంచి స్మైల్ తో సెల్ఫీ తీసింది.ఈ పిక్ నేషనల్ క్రష్ ఫ్యాన్స్ తో పాటు విజయ్ ఫ్యాన్స్ ను సైతం ఆకట్టు కుంటుంది.







