స్టార్ ఫ్రూట్. పేరు వినగానే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పండ్లేమో అని చాలా మంది భావిస్తుంటారు.
అలా అనుకుంటే పొరపాటే.ఎందుకంటే, పురాతన కాలం నుంచి ఈ స్టార్ ఫ్రూట్స్‌ను మన దేశంలోనూ సాగు చేస్తున్నారు.
ఈ పండ్లను కరాంబోలా అని కూడా పిలుస్తారు.ప్రపంచవ్యాప్తంగా మంచి ఆధరణ పొందిన పండ్లలో ఇవీ ఒకటి.
లేత పసుపు పచ్చ రంగులో ఉండే స్టార్ ఫ్రూట్.తీపి, పులుపు రుచిని కలిగి ఉంటాయి.
అలాగే ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందుకే ఈ స్టార్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల.అందులో విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్తను బలపరుస్తాయి.
ఒత్తిడి, డిప్రెషన్, అందోళన వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.అలాగే మధుమేహం రోగులు కూడా ఈ స్టార్ ఫ్రూట్స్‌ను తీసుకోవచ్చు.
వీటిని డైట్‌లో చేర్చుకుంటే.బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
గర్భిణీ స్త్రీలు ఈ పండ్లను తింటే.పుట్టబోయే శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.అలాగే పాలిచ్చే తల్లులు వీటిని తీసుకుంటే.పాలు బాగా పడతాయి.స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.అందు వల్ల, వీటిని తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గు ముఖం పడుతుంది.
జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.అంతేకాదు, స్టార్ ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఇక ఈ పండ్లను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, నీరసం, అలసట వంటి సమస్యలు పరార్ అవుతాయి.కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలోనూ స్టార్ ఫ్రూట్స్ సహాయపడతాయి.