పాదాల గురించి మగవారు పెద్దగా పట్టించుకోరు.కానీ ఆడవారు మాత్రం కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు.
పాదాలను( Feet ) అందంగా మృదువుగా మెరిపించుకోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.ఎప్పటికప్పుడు పెడిక్యూర్( Pedicure ) చేయించుకుంటూ ఉంటారు.
అయినా సరే ఒక్కోసారి పాదాలు పాడవుతుంటాయి.డ్రై గా మరియు రఫ్ గా మారిపోతుంటాయి.
అయితే అటువంటి పాదాలను రిపేర్ చేయడానికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా బాగా సహాయపడతాయి.మరి లేటెందుకు ఆ టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.
![Telugu Beautiful Feet, Besan, Feet, Care, Care Tips, Healthy Feet, Honey, Papaya Telugu Beautiful Feet, Besan, Feet, Care, Care Tips, Healthy Feet, Honey, Papaya](https://telugustop.com/wp-content/uploads/2024/11/Follow-these-tips-for-smooth-and-beautiful-feet-detailss.jpg)
టిప్-1:
ముందుగా ఉప్పు వేసిన గోరువెచ్చని నీటిలో పాదాలను 10 నిమిషాల పాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,( Rice Flour ) రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి,( Besan Flour ) వన్ టేబుల్ స్పూన్ పెరుగు, పావు టీ స్పూన్ పసుపు మరియు సరిపడా నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చెక్కతో పాదాలను రుద్దుతూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.
ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను పాదాలకు అప్లై చేసుకోవాలి.మాయిశ్చరైజర్ కు బదులుగా బాదం ఆయిల్ ను రాసుకున్న పరవాలేదు.
ఈ రెమెడీ పాదాలపై మురికి, మృత కణాలను తొలగిస్తుంది.అదే సమయంలో పొడిబారిన పాదాలను తేమగా మార్చి మృదువుగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
![Telugu Beautiful Feet, Besan, Feet, Care, Care Tips, Healthy Feet, Honey, Papaya Telugu Beautiful Feet, Besan, Feet, Care, Care Tips, Healthy Feet, Honey, Papaya](https://telugustop.com/wp-content/uploads/2024/11/Follow-these-tips-for-smooth-and-beautiful-feet-detailsa.jpg)
టిప్ 2:
పాదాలను స్మూత్ గా మార్చడానికి బొప్పాయి( Papaya ) కూడా చాలా బాగా సహాయపడుతుంది.ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు బొప్పాయి ప్యూరీ, వన్ టీ స్పూన్ తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చేత్తో పాదాలను బాగా రుద్దుతూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ విధంగా చేసినా కూడా పాదాలు పొడిబారకుండా ఉంటాయి.మృదువుగా తయారవుతాయి.
అందంగా మెరుస్తాయి.