ప్రతిసారి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటూ ఉంటారు.అయితే దర్శనం టికెట్ల కోసం భక్తులు భారీగా తరలి వస్తారు.
ఈ విధంగా స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకుంటూ ఉంటుంది.అయితే జనవరి 2 నా కూడా తిరుమలలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన భక్తుల కు తొక్కిసలాట చోటుచేసుకుంది.
అయితే శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11 వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ఏర్పాట్లు చేసింది.
అయితే రోజుకు 45 వేలు చొప్పున 10 రోజులకు గాను 4.5 లక్షల సర్వదర్శనంతో టోకెన్లను జారీ చేయించారు.ఈ నేపథ్యంలోనే వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీవారి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులు భారీగా తరలిన రావడం జరిగింది.
అయితే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులు భారీగా తరలి రావడంతో తోపులాట జరిగింది.అదే జనవరి 1వ తేదీ మధ్యాహ్నం నుంచి సర్వదర్శనం కోసం టోకన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించింది.
అదే ముందు రోజు రాత్రి నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఇక తిరుమల 9 ప్రాంతాలలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తారని టీటీడీ ప్రకటించింది.
దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసింది.ముఖ్యంగా తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
అయితే ఈ నేపథ్యంలోనే స్వల్ప తొక్కిసలాట జరిగింది.దీంతో పలువురు భక్తులు కింద పడిపోయారు.
వారికి స్వల్ప గాయాలు తగిలాయి.ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాలను శనివారం రోజున జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి అలాగే టిటిడి జేఈవో సదా భార్గవి పరిశీలించారు.

అదేవిధంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, వారు పరిశీలించారు.అదేవిధంగా కేంద్రాల వద్ద టోకన్లు పోగు చేస్తామని ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పారిశుద్ధ్య కార్మికులకు నియమిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.ఇక జనవరి ఒకటి నుంచి ప్రారంభించి కోట పూర్తి అయ్యేంతవరకు నిరంతరగా జారీ చేస్తామని జెఈఓ శ్రీమతి సదా భార్గవి తెలిపారు.