తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం.
సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కొన్నేళ్లు పూర్తి అవుతున్న ఇప్పటికీ తమన్న అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతోంది.అందం విషయంలోనే కాకుండా అవకాశాల విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది.
ఇకపోతే తమన్నా మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.తమన్నా ఎక్కడికి వెళ్లినా ఆమె ప్రేమ వ్యవహారం అలాగే పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
కథ తమన్నా ఇప్పటివరకు ప్రేమ, పెళ్లి జోలికి వెళ్లలేదు.పెళ్లి గురించి ప్రస్తావన వస్తే చాలు ఆ విషయాన్ని దాటేస్తూ వచ్చింది తమన్నా.
ఇది ఇలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా తమన్నా ప్రేమ వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది.తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని తమన్నా గోవాలో జరుపుకుంది.
ఇక ఆ పార్టీలో తమన్నా రెడ్ డ్రెస్సులు మెరిసింది.ఇక అందరూ పార్టీ మూడ్ లో ఉండగా తమన్న ఒక వ్యక్తిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడం ప్రస్తుతం వయలుగా మారింది.
దాంతో నెటిజెన్స్ ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీయడం ప్రారంభించారు.

మరి తమన్నా ముద్దు పెట్టుకున్న వ్యక్తి మరెవరో కాదు నటుడు విజయ్ వర్మ.వీరిద్దరూ ఎవరికీ తెలియకుండా గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్టు తెలుస్తోంది.కాగా వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు.
కాగా విజయ్ వర్మ పలు హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అలాగే తెలుగులో నాని నటించింన ఎంసిఎ సినిమాలో విలన్ గా నటించాడు.
మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజమా కాదా అన్నది తెలియాలి అంటే తమన్నా స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.ఈ వార్తలపై స్పందించిన పలువురు నెటిజన్స్ ప్రేమ పెళ్లి వ్యవహారం గురించి అడిగితే మాట దాటేశావు మరి ఇదేంటి తమన్నా అంటూ ప్రశ్నిస్తున్నారు.







