బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఇప్పటికే ఎంతో అద్భుతమైన రేటింగ్ కైవసం సొంతం చేసుకుని మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే రెండవ సీజన్ కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేశారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో సినిమా సెలబ్రిటీలను మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారు.
ఇలా ఈ కార్యక్రమం సినీ రాజకీయ ప్రముఖులలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇదివరకే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ నాయకులు హాజరయ్యారు.
త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుంది.అయితే తాజాగా ఈ కార్యక్రమం పై ఏపీ మంత్రి రోజా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ కార్యక్రమం గురించి పలు విషయాలను తెలియచేశారు.
తనకి కూడా బాలయ్య టాక్ షోలో పాల్గొనమని ఆహ్వానం అందిందని ఈమె తెలిపారు.అయితే తాను ఈ కార్యక్రమంలో పాల్గొననని వారి ఆహ్వానాన్ని తిరస్కరించానని రోజా తెలిపారు.

ఇలా ఈ కార్యక్రమంలో తాను పాల్గొనక పోవడానికి ఓ కారణం ఉందని రోజా తెలిపారు.బాలకృష్ణతో నాకు ఎంతో మంచి పరిచయముంది.మేమిద్దరం కలిసి పలు సినిమాలలో నటించాము.అయితే అసెంబ్లీ సమావేశాలలో రాజకీయ విభేదాలు గందరగోళం ఏర్పడిన సమయంలో తనని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానం వచ్చిందని తెలిపారు.
ఆ సమయంలో తాను ఈ కార్యక్రమంలో పాల్గొంటే పార్టీకి నష్టం రావడమే కాకుండా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది అన్న ఉద్దేశంతో తాను ఈ కార్యక్రమంలో పాల్గొననని చెప్పినట్టు రోజా తెలిపారు.ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి రోజా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.