ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తమ రోజును కాఫీ తోనే ప్రారంభిస్తుంటారు.కొందరైతే బ్రష్ చేయక ముందే కాఫీ తాగేస్తుంటారు.
పొద్దుపొద్దునే కడుపులో ఒక కప్పు కాఫీ పడితే ఎక్కడ్లేని ఉత్సాహం వస్తుంటుంది.మైండ్, బాడీ రిఫ్రెష్ అవుతుంది.
కాఫీ వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే.కేశ సంరక్షణకు మాత్రం అద్భుతంగా సహాయపడుతుంది.
రెండు స్పూన్ల కాఫీ పౌడర్ తో జుట్టును నల్లగా, ఒత్తుగా మార్చుకోవచ్చు.అవును మీరు విన్నది నిజమే.
మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు గట్టి పెరుగును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.మూత పెట్టి ఈ మిశ్రమాన్ని అరగంట పాటు వదిలేయాలి.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే కాఫీ పౌడర్, కొబ్బరి నూనె, పెరుగు లో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.
కురులు ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.అలాగే కాఫీ పౌడర్ వైట్ హెయిర్ ను బ్లాక్ గా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.
తెల్ల జుట్టు రావడం ప్రారంభమైతే కచ్చితంగా ఈ రెమెడీని పాటించండి.దాంతో స్టార్టింగ్ లోనే మీరు వైట్ హెయిర్ కు చెక్ పెట్టవచ్చు.ఇక తెల్ల జుట్టు రాని వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.తద్వారా హెయిర్ ఎక్కువ కాలం పాటు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.