1.ఎంపీ కోమటి రెడ్డి కామెంట్స్
యాదాద్రి ఆలయం పునః ప్రారంభోత్సవం కు ప్రోటోకాల్ పాటించకపోవడం పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ అయిన తనను ఈ కార్యక్రమానికి పిలవకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
2.బిజెపి సమరభేరీ
విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా బషీర్ బాగ్ లో బీజేపీ సమరభేరీ నిర్వహించింది.ఈ సందర్భంగా ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
3.యాదాద్రి ఆలయంలోకి ఉత్సవమూర్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు.అనంతరం ఉత్సవ మూర్తులను గర్భాలయంలోకి చేర్చారు.
4.సీఎం జగన్ కు సమన్లు అందలేదు
ఏపీ సీఎం జగన్ సోమవారం కోర్టుకు హాజరుకావాలని జారీచేసిన సమన్లు అందలేదని జగన్ తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి తెలిపారు.
5.వరంగల్ లో కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వరంగల్ జిల్లా లో కార్మికుల సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది.
6.సింగరేణిలో సార్వత్రిక సమ్మె ప్రారంభం
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు నిరసనగా సోమవారం ఉదయం సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది.
7. నేడు ఆటో లు, క్యాబ్ ల బంద్
ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త కార్మికుల సమ్మె కు రాష్ట్రంలోని క్యాబ్ లు, ఆటోల సంఘాలు మద్దతు పలికాయి.
8.టీజేఎస్ విలీనం చేయను : కోదండరాం
ఆమ్ ఆద్మీ పార్టీలో టీజేఎస్ విలీనం చేసే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
9.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 71,176 మంది భక్తులు దర్శించుకున్నారు.
10.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1270 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.తుది దశకు చేరుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది.రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడనుంది.
12.ఎస్ కే యూ పాలకమండలి సమావేశం
అనంతపురంలో నేడు ఎస్ కే యు యూనివర్సిటీ పాలక మండలి సమావేశం జరగనుంది.
13.నెల్లూరు జిల్లాలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.
14.విశాఖలో ఏపీ గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు విశాఖలో పర్యటించనున్నారు.సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకోనున్నారు.
15.యూపీఎస్సీ లో 28 పోస్టుల భర్తీ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యూపీ ఎస్సీ ) వివిధ మంత్రిత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఆసక్తి గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతోంది.
16.కరెంటు సమస్యల ఫిర్యాదుకు యాప్
తెలంగాణలో కరెంటు సమస్యలపై ఫిర్యాదు కు టీఎస్ ఎస్పీడీసీఎల్ (TSSPDCL ) యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
17.చెక్ బౌన్స్ కేసు .కోర్టుకు బండ్ల గణేష్
చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరు కోర్టుకు హాజరయ్యారు.
18.గోవా ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు.
19.తెలంగాణలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రత
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత క్రమక్రమంగా పెరుగుతోంది.రాబోయే ఐదు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,310
.