మీ పిల్లలకు కొన్ని రకాల ఆహార పదార్థాలు ఇస్తే వారి ఎదుగుదలకు అవి ఎంతగానో ఉపయోగపడతాయి.అలా కాకుండా వారికి చిన్నప్పటి నుంచే ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ స్నాక్స్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్ ఇస్తే మాత్రం చిన్న వయసులోనే వారిలో షుగర్, రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి ఆహార పదార్థాలు తినడం వల్ల సెరటోనిన్( Serotonin ) అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది.దీనివల్ల ఇలాంటి ఆహారాలు తీసుకునే వారి మెదడు మొద్దు బారిపోవడమే కాకుండా, ఏకాగ్రత కూడా దూరం అవుతుంది.
అలాగే డిప్రెషన్ కి కూడా గురవుతారు.

ఇంకా చెప్పాలంటే జంక్ ఫుడ్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు ఇవ్వడం వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు స్వీట్స్ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.కానీ స్వీట్స్, కేక్స్, బేబీ ఫుడ్స్, ఐస్ క్రీమ్ లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది.
దీంతో వారికి చిన్న వయసులోనే షుగర్ వ్యాధి( Diabetes ) వచ్చే అవకాశం ఉంది.ఇలాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల ఆకలి పై ప్రభావం చూపిస్తుంది.
ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు కలర్ ఫుల్ ఆహారాన్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు.కానీ అలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ ని పిల్లలకు ఇవ్వకూడదు.

ఎందుకంటే వాటిలో రసాయనాలు అనేవి ఎక్కువగా కలుపుతూ ఉంటారు.కాబట్టి అవి వారి మెదడు ను ప్రభావితం చేస్తాయి.కాస్త కష్టమైన సరే పిల్లలకు పరిశుభ్రమైన ఇంటి ఆహారాన్ని ఇవ్వడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే చిన్న పిల్లలకు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అంటే ఎంతో ఇష్టం.
అందుకోసమే వీటిని కొనివ్వమని ఎక్కువగా అడుగుతూ ఉంటారు.కానీ చాక్లెట్స్ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.
ఎక్కువ మోతాదులో కెఫిన్ ఇస్తే వారి ఆరోగ్యం పై చెడు ప్రభావం పడుతుంది.దీనివల్ల చిన్న పిల్లల్లో నిద్రలేమి, భయం, తలనొప్పి, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అంతేకాకుండా ఇది చిన్న పిల్లల ఎదుగుదల పై కూడా ప్రభావం చూపుతుంది.