సినిమా తీయడం ఎంత ముఖ్యమో.దాన్ని విడుల చేయడం అంతే ముఖ్యం.
సరైన టైం చూసి జనాల్లోకి వదలాలి.అప్పుడే సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తాయి.
టాప్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదల కాకుండా దర్శక నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.కానీ గతంలో సినిమాలు చాలా తక్కువ విడుదల అయ్యేవి.
అంతేకాదు.ఒకే హీరో సినిమాలు రెండు ఒకే రోజు విడుదల అయిన సందర్బాలూ ఉన్నాయి.ఇలా ఒకే రోజు రిలీజ్ అయిన రెండు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
ఎన్టీఆర్:
తెలుగు సినీ పరిశ్రమలో ఒకే రోజు ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు విడుదల చేసే చరిత్రకు ఎన్టీఆర్ నాంది పలికాడు.1959 జనవరి14 న అప్పుచేసి పప్పు కూడు సినిమాతో పాటు సంపూర్ణ రామాయణం చిత్రాన్ని రిలీజ్ చేశాడు.మరో సందర్భంలోనూ ఆయన రెండు సినిమాలను ఓకే రోజు విడుదల చేశాడు.1961 మే 5నపెండ్లి పిలుపు , సతీ సులోచన చిత్రాలను రిలీజ్ చేశాడు.ఈ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి.
శోభన్ బాబు :
ఈయన కూడా ఒకే రోజు తన రెండు చిత్రాలను రిలీజ్ చేశాడు.1968 జులై 19న శోభన్ బాబు నటించిన లక్ష్మీ విలాసం, పంతాలు పట్టింపులు ఒకే రోజు విడుదలయ్యాయి.
చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి నటించిన కాళి, తాతయ్య ప్రేమలీలలు అనే ఈ రెండు సినిమాలు 1980 సెప్టెంబర్ 19న రిలీజయ్యాయి .అటు 1982 అక్టోబర్ 1న మరోసారి పట్నం వచ్చిన పతివ్రతలు , టింగు రంగడు అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి.
క్రిష్ణ :
సూపర్ స్టార్ క్రిష్ణ హీరోగా నటించిన చిత్రాలు కూడా రెండూ ఒకే రోజు విడుదల అయ్యాయి.యుద్ధం , ఇద్దరు దొంగలు చిత్రాలు జనవరి 14, 1984లో రిలీజ్ అయ్యాయి.
బాలకృష్ణ :
బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు రెండూ 1993 సెప్టెంబర్ 3న రిలీజయ్యాయి.
నాని :
తెలుగు ఇండస్ట్రీలో చివరి సారిగా ఓకే హీరోకు చెందిన రెండు సినిమా 2015 మార్చ్ 21న విడుదల అయ్యాయి.నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం , జెండాపై కపిరాజు సినిమాలు రిలీజ్ అయ్యాయి.