బొప్పాయి మనలో చాలామందికి ఇష్టం.సీజన్ తో పెద్దగా సంబంధం లేకుండా మార్కేట్లో దొరుకుతుంది.
పల్లెటూళ్ళలో అయితే ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు, పెరట్లోనే దొరుకుతుంది.అద్భుతమైన రుచి బొప్పాయి ఆస్తి.
కాని ఇది కేవలం రుచికరమైన ఫలం మాత్రమే కాదు.దీన్ని ఒక రోగనిరోధక, రోగసంహారక ఫలంగా చూసారు మన పూర్వికులు.
ఆయిర్వేదంలో కూడా బొప్పాయి గురించి, అది శరీరానికి చేసే మేలు గురించి ఉంటుంది.అంటే వేల సంవత్సరాలుగా దీన్ని మానవ శరీరం కోసం ఉపయోగిస్తున్నారన్నమాట.
ఇప్పుడు బొప్పాయి నయం చేసే టాప్ 5 సమస్యలు ఏంటో చూద్దాం.
* మనం తినే అహారం జీర్ణం అయ్యేది కడుపులో వచ్చే కొన్ని ఆసిడ్స్ లేదా జ్యూస్ వలన.ఆయిర్వేదం ప్రకారం బొప్పాయి ఈ ఆసిడ్స్ ని మంచి ట్రాక్ లో పెడుతుంది.భోజనానికి ఓ అరగంట ముందు కొంచెం బొప్పాయి తిని, ఆ తరువాత భోజనం చేస్తే జీర్ణ సమస్యలను నియంత్రణలో పెట్టుకోవచ్చు.
* డెంగ్యూ జ్వరం అనేది పెద్ద సమస్య.ఇది పెద్దదైతే మనిషి ప్రాణాల్ని కూడా తీసుకుంటుంది.కాని దీన్ని కూడా కంట్రోల్ చేయగలదు బొప్పాయి.ఇది కేవలం ఒకనాటి ఆయుర్వేదమే కాదు, ఈనాటి సైన్స్ కూడా చెబుతున్న మాట.బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా డెంగ్యూ చికిత్సకి ఉపయోగపడతాయి.
* బొప్పాయిలో న్యూట్రింట్స్ , యాంటిఆక్సిడెంట్స్ సహాయంతో రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది.
అన్ని భాగాలకు రక్తం బాగా అందేలా చేస్తుంది.కోలెస్టిరాల్ కరిగిస్తూ గుండెని కాపాడుకుంటుంది.
* పొలీసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ .ఈ పెరుతో పెద్దగా పరిచయం ఉండదు కాని, ఈ సమస్యని సాధారణంగా ఎదుర్కొంటారు మహిళలు.హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పడంతో పీరియడ్స్ తీవ్రమైన నొప్పులు, సమయం తప్పే పీరియడ్సద వస్తుంటాయి.ఇలాంటి సమయంలో బొప్పాయి ఉపశమనాన్ని ఇవ్వడమే కాదు, ఈ సమస్యను తగ్గిస్తుంది.
* బెటా కిరోటిన్ ఉండటం వలన బొప్పాయి కంటిచూపుని మెరుగుపరుస్తుంది.విటమిన్ సీ ఉండటం వలన మెటాబాలిజం రేట్ ని సరిచేసి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
పపేన్ ఉండటం వలన ఇది వెన్నునొప్పి సమస్యకు కూడా చికిత్సను అందిస్తుంది.