రాజకీయ ఎత్తులు ఒక్కొక్కసారి ఎవరికి అర్ధం కావు.ప్రత్యర్థులు ఎంతటి బలవంతులు అయినా సరే వారిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కాచుకుకూర్చుంటారు.
అంతిమంగా కావాల్సింది ప్రత్యర్థుల పతనం తమ విజయం.ఇప్పుడు ఈ విధంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతానికి కేంద్ర అధికార పార్టీ బీజేపీలోకి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు చేరిపోయారు.అలాగే ఏపీలో దాదాపు 15 మంది ఎమ్యెల్యేలు బీజేపీలోకి జంపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
ఈ సందర్భంగా టీడీపీ ఉనికి గురించి చాలామంది కలవరపడుతున్నారు.అసలు మరోసారి ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందా అంటూ ఆరా తీస్తున్నారు.
అయితే టీడీపీకి చెందిన ఎంపీలు, ఎమ్యెల్యేలు పార్టీ మారడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని, జగన్ ను దెబ్బకొట్టేందుకే వారిని దగ్గరుండి మరీ బీజేపీలోకి పంపుతున్నాడనే అనుమానాలు కూడా అందరిలో వ్యక్తం అవుతున్నాయి.
బాబు ఇలా చేయడం వెనుక రెండు ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం టీడీపీ ఎంపీలే లక్ష్యంగా ఐటీ దాడులు, కేసులు ఇలా అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టె ప్రక్రియ కొనసాగుతోంది.ఇక జగన్ ప్రభుత్వం కూడా వారిని అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని గ్రహించి వారిని బీజేపీలోకి పంపుతున్నాడనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ వీరిలో ఎవరూ కూడా టీడీపీని విడిచి వెళ్ళే వారే కాదు.కానీ హఠాత్తుగా వీరు బీజేపీలోకి వెళ్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
బీజేపీలో అయిదేళ్ళు హాపీగా సేఫ్ జోన్లో ఉండి మరో వైపు నుంచి టీడీపీకి అన్నిరకాలుగా సహకరిస్తారని బాబు భావిస్తున్నాడట.

జగన్ మోహన్ రెడ్డి బీజేపీతో కలసి ప్రయాణం చేస్తున్నారు.ఏపీకి అన్నిరకాలుగా సహకరిస్తామని మోదీ చెబుతున్నారు.జగన్ కూడా మోదీతో స్నేహపూరిత సంబంధాలు కొనసాగిస్తూనే తన రాజకీయం తాను చేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తున్నాడు.
అయితే వైసీపీని బీజేపీ స్నేహాన్ని విడదీసి, రానున్న రోజుల్లో కేంద్రం నుంచి వైసీపీకి ఏ సాయం అందకుండా చేసేందుకు బాబు ప్లాన్ లో భాగమని అంటున్నారు.ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ని బీజేపీని విడదీస్తే ఏపీకి కేంద్ర సాయం నిలిచిపోతుంది.
అపుడు జగన్ మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాలు చేయలేక ఇబ్బంది పడతారు.అది వచ్చే ఎన్నికల నాటికి టీడీపీకి రాజకీయంగా కలసివస్తుంది అని బాబు నమ్ముతున్నాడు.అయితే బాబు స్కెచ్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.