గత కొన్నాళ్లుగా మెగా హీరోల సినిమాలకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ కూడా రావడం లేదు.ఎప్పుడెప్పుడు మెగా మూవీ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.అతి త్వరలోనే సినిమా టీజర్‌ను విడుదల చేయబోతున్నారట.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుపుతున్నారు.వారం రోజుల్లో హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారు.

వచ్చే వారంలో వాల్మీకి చిత్రం టీజర్‌ను విడుదల చేయబోతున్నారు.భారీ అంచనాలున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నాడు.విలన్ అంటూ కూడా ప్రచారం జరుగుంది.తమిళ హిట్ మూవీ జిగర్తాండ మూవీకి ఇది రీమేక్.త్వరలోనే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సినిమాపై ఉన్న అనుమానాలు అన్ని కూడా పటా పంచలు కాబోతున్నాయి.

ఇక ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు.అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంను ఆధరించేలా ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.రికార్డు స్థాయిలో సినిమా బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ అంటూ అభిమానుల్లో అంచనాలు కలిగిస్తున్నారు.మెగా హీరో నుండి టీజర్ రాబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
వాల్మీకి టీజర్ మెగా ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా గుడ్ న్యూస్‌గా చెప్పుకోవాలి.