నాటి నుంచి నేటి వరకు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది.జనాలను థియేటర్లకు తీసుకొచ్చిన కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా ఉన్నాయి.
అందుకే ఈ ఐటెం సాంగ్స్ విషయంలో దర్శక నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.కోట్ల రూపాయలు ఖర్చు చేసి.
అందాల ముద్దుగుమ్మల చేత ఐటెం సాంగ్స్ చేయిస్తారు.ఈ మధ్య టాప్ హీరోయిన్స్ తో సైతం స్పెషల్ సాంగ్స్ చేయిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్.
రంగస్థలం సినిమాలో టాలీవుడ్ టాప్ బ్యూటీ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది.జిగేల్ రాణి అంటూ ఊపు ఊపేసింది.
అటు తాజాగా సమంతాను పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఎంపిక చేశారు.రామోజీ ఫిల్మ్ సిటీలో ఆమెపై ఈ పాటను తెరెక్కించారు.
అటు నాగార్జున హీరోగా చేస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తున్నారు.ఇందుకోసం తాజాగా ఫేమస్ అయిన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను ఎంపిక చేస్తున్నారు.
లడ్డుండ.అనే పాటలో పలువురు హీరోయిన్లు కనిపించబోతున్నారట.
అయితే ఈ కుర్ర హీరోయిన్ నాగార్జునతో ఏ రేంజిలో స్టెప్పులు వేసిందో చూడాలి.
అటు టీవీ తెరపై సందడి చేస్తున్న రష్మికి ఓ సూపర్ ఆఫర్ దకింది.చిరంజీవితో ఆడిపాడే చాన్స్ కొట్టేసింది.మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోలా శంకర్ లో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారట.
ఇందులో స్టెప్పులు వేసేందుకు ఈ హాట్ యాంకర్ ను ఎంపిక చేశారట.అటు ఎఫ్-3 సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ పెట్టారట.ఇందులో నటించేందుకు క్యూట్ బ్యూటీ సోనాల్ చౌహాన్‌ని ఎంపిక చేశారట.ఈమె క్యారెక్టర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందట.
ఇప్పటికే పలు సినిమాల్లో పలువురు భామలు స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.రెడ్ లో డించక్ డించక్ అంటూ హెబ్బా పటేల్ డ్యాన్స్ చేసింది.
భూమ్ బద్దల్ అంటూ క్రాక్’లో, పెప్సీ ఆంటీ అంటూ గోలీమార్ లో అప్సరారాణి అదరగొట్టింది.చావు కబురు చల్లగాలో అనసూయ అద్భుతంగా ఆకట్టుకుంది.