ఉదయాన్నే టిఫిన్ ను స్కిప్ చేయకుండా ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు.రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్ట కూడదు.పిల్లలైనా.
పెద్దలైనా బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.అయితే బ్రేక్ ఫాస్ట్ చేయడమే కాదు.
కొన్ని ఆరోగ్య నియమాలు కూడా పాటించాల్సి ఉంది.నేటి ఉరుకులు, పరుగుల జీవన విధానంలో చాలా మంది టిఫిన్ విషయంలో ఒక కామన్ తప్పు చేస్తుంటారు.
అదేంటంటే.మార్నింగ్ నిద్రలేవగానే మొదట టిఫిన్ చేసేసి… ఆ తర్వాత స్నానం చేసి ఆఫీస్ లేదా స్కూల్‌కి వెళ్లి పోతుంటారు.ఇలా చాలా మందికి ఉన్న అలవాటు.అయితే నిజానికి బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ స్పానం చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే.బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని.
ఆ ప్రభావం జీర్ణాశయంపై పడుతుందని అంటున్నారు.
అలాగే బ్రేక్ ఫాస్ట్ తిన్న వెంటనే స్నానం చేసినప్పుడు.
రక్త ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలకు జరుగుతుందే తప్ప జీర్ణ వ్యవస్థకు మాత్రం సరిగ్గా జరగదు.ఫలితంగా తీసుకున్న ఆహారం జీర్ణంకాక.
అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, వాంతులు, అల్సర్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.అలాగే ఊబకాయానికి కూడా గురి చేస్తుంది.
కాబట్టి, బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మాత్రం స్నానం చేయరాదు.అదే స్నానం చేసిన తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే.
త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు మెదడు చురుగ్గా పని చేసి రోజంతా ప్రెష్‌గా ఉండ గలుగుతారు.కాబట్టి, ఇకపై స్నానం చేసిన తర్వాతనే బ్రేక్ ఫాస్ట్ తీసుకునేందుకు ప్రయత్నించండి.
అయితే బ్రేక్ ఫాస్ట్‌లో ఆయిలీ ఫుడ్స్ కాకుండా ఆరోగ్యానికి ఉపయోగపడే ఓట్స్, ఇడ్లీ, నట్స్, ఫ్రూట్స్ వంటి తీసుకుంటే మంచిది.