భారతీయులు సాంప్రదాయాలకు ఎంతటి విలువను ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా ఇండియన్ మహిళలు తమ కట్టు బొట్టు విషయంలో చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటారు.
విదేశాల్లో చిన్న చిన్న డ్రస్‌లు, పొట్టి స్కర్ట్స్ వేసుకుంటారు.కాని ఇండియాలో మాత్రం అలా కాదు.
ఇండియాలో ఎక్కువ శాతం మంది చీర కట్టుకుని నిండైన అమ్మాయిగా కనిపిస్తూ ఉంటారు.చీరలో మహిళను చూడగానే అమ్మ అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అలాంటి ఒక ఇండియన్ మహిళ చీర కట్టుకుని బయటకు వెళ్లింది.ఆమె చీరకు పొరపాటను నిప్పు అంటుకుంది.నిప్పు అంటుకున్నా కూడా చీరను ఆమె తొలగించి నలుగురిలో పరువు పోగొట్టుకోవడంకు ఇష్టపడలేదు.చీరకు నిప్పు అంటుకున్న వెంటనే ఆమె చీరను తొలగిస్తే చిన్న గాయం కూడా అయ్యేది కాదు.
కాని నలుగురిలో చీర విప్పేస్తే పరువు పోతుందనే ఉద్దేశ్యంతో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఒక గదిలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి చీరను విప్పేసింది.

అప్పటికే ఆమె ఒల్లు చాలా వరకు కాలింది.స్థానికులు వెంటనే ఆమెకు మరో వస్త్రం కప్పి హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.ఈ సంఘటన మరెక్కడో జరగలేదు.
తెలుగు రాష్టం లోనే జరిగింది.ఆమె గురించిన పూర్తి వివరాలు అయితే తెలియదు కాని, ఆమె పేరు ఛాయాగా గుర్తించారు.
ప్రస్తుతం ఆమె కిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది.ఆమె ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమెను మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు వైధ్యులు.
ప్రస్తుతం ఛాయకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇండియన్ స్త్రీకి నిజమైన ఉదాహరణ ఛాయ అంటూ ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి.