యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ).రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
తెలుగు బుల్లితెర పై మకుటం లేని మహారాణిగా దూసుకుపోతోంది సుమ.బుల్లితెర పై అటు వెండితెర పై ఏ షోలో ఏ ఈవెంట్ లో చూసిన కూడా సుమ పేరే వినిపిస్తూ ఉంటుంది.ఈవెంట్ లకు, షోలకు, ప్రమోషన్ లకు, ప్రీ రిలీజ్ వేడుకలకు ఇలా ప్రతి ఒక్క షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఇప్పటివరకు కోట్లల్లో సంపాదించింది యాంకర్ సుమ.ఒక్క షోకి దాదాపు 5 లక్షలు తీసుకునే టాప్ యాంకర్ సుమ.
ఆమె ఇలా షోలతో కోట్లు సంపాదించింది.అవన్నీ సరిపోవు అన్నట్లు ఇప్పటికీ ఇంకా సంపాదిస్తూనే ఉంది.
అయితే ఈ మధ్యకాలంలో చూసుకుంటే సుమా హవా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పవచ్చు.సుమ పేరుకు బదులుగా ఎక్కువగా యాంకర్ శ్రీముఖి( Anchor Srimukhi ) పేరే వినిపిస్తోంది.
ఆ సంగతి పక్కన పెడితే.ఇప్పుడు ఈ షోలతో పాటు ఆమె ఫోకస్ తన కొడుకు కెరియర్ పై పెట్టింది.
సుమ కొడుకు రోషన్ కనకాల( Roshan Kanakala ) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.ఆ మూవీ పేరు బబుల్ గమ్( Bubble gum ).ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల అయింది.ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతని సుమ తన నెత్తినెట్టుకొంది.సుమ కనకాల హీరోయిన్ గా సక్సెస్ కాలేదు.
దాంతో ఆమె బుల్లితెరకు షిఫ్ట్ అయింది.యాంకర్ గా స్థిరపడింది.
ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు.కానీ, తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టాలి అనుకుంటోంది సుమ.కాగా సింగర్ సునీత( Singer Sunitha ) ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.మొదటి భర్త ద్వారా ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

కొడుకు ఆకాష్( Akash ) హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.ఆకాష్ గోపరాజు మొదటి చిత్రం సర్కార్ నౌకరి.( Sarkar Naukari ) ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.సునీత ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు.అలా సుమ, సునీత ఇప్పుడు తమ కెరీర్లు కన్నా తమ కొడుకుల కెరీర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.యాంకర్ సుమ, సింగర్ సునీత ఇద్దరు మంచి స్నేహితులు అన్న విషయం మనందరికీ తెలిసిందే.
సునీత పెళ్లి సమయంలో సుమ చేసిన హంగామా సందడి అంతా ఇంతా కాదు.చాలా సందర్భాలలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని బయటపెట్టారు సుమ సునీత.
కాగా సింగర్ సునీత ప్రస్తుతం ఒకవైపు సినిమాలకు పాటలు పాడుతూనే మరొక వైపు తన కొడుకు కెరియర్ మంచి గాడిలో పెట్టే పనిలో పడింది.అలాగే యాంకర్ సుమ కూడా ఒకవైపు బుల్లితెరపై వెండితెరపై షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు కొడుకు కెరియర్ పై కూడా దృష్టిని పెట్టింది.