టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు అని అందరూ భావిస్తారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న హీరో ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరు సమాధానంగా వినిపిస్తుంది.
చిరంజీవితో ఎక్కువ సంఖ్యలో సినిమాలను నిర్మించిన నిర్మాతలలో అశ్వనీదత్ ఒకరు.ఒక ఇంటర్వ్యూలో అశ్వనీదత్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నా హస్తవాసి మంచిదని ఫీల్ అవుతానని చిరంజీవి చెప్పుకొచ్చారు.కృష్ణగారు, చిరంజీవిగారు నా బ్యానర్ లోనే తమ కొడుకులను పరిచయం చేయించారని చిరంజీవి తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ సూచనల మేరకు నేను వైజయంతీ మూవీస్ అని బ్యానర్ కు పేరు పెట్టానని ఆయన వెల్లడించారు.రామారావుగారితో గొప్ప అనుబంధం అని ఆయన దైవాంశ సంభూతులు అని నేను భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.
రామారావు, నాగేశ్వరరావుతో కెరీర్ మొదలుకావడం సంతోషంగా అనిపిస్తోందని ఆయన తెలిపారు.మహానటి సినిమా తీయడానికి రామారావుగారు, నాగేశ్వరరావు కారణమని ఆయన చెప్పుకొచ్చారు.
ఏఎన్నార్ అంటే జోవియల్ గా వెళ్లిపోయేవాళ్లమని ఆయన తెలిపారు.పర్ఫెక్ట్ గా డిసిప్లీన్ ను మెయింటైన్ చేసిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి అని అశ్వనీదత్ వెల్లడించారు.

చిరంజీవిగారు గ్రేట్ జెంటిల్ మేన్ అని అశ్వనీదత్ కామెంట్లు చేశారు.చిరంజీవి గారిని చూసి చాలామంది హీరోలు ఫాలో అయ్యారని అశ్వనీదత్ తెలిపారు.నాగార్జున అప్పటికీ ఇప్పటికీ చాలా మారారని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.నేను నిర్మించిన అన్ని సినిమాలలో జగదేక వీరుడు అతిలోక సుందరి ఇష్టమైన సినిమా అని అశ్వనీదత్ వెల్లడించారు.
ఆఖరి పోరాటం సినిమా చాలా ఛాలెంజింగ్ గా అనిపించిందని అశ్వనీదత్ అన్నారు.ఆ సినిమా ట్రెండ్ సెట్టింగ్ సినిమా అని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు.వెంకటేష్ గారు ప్రొడ్యూసర్ కు కంఫర్ట్ ఉందా అని చూస్తారని అశ్వనీదత్ తెలిపారు.