ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన పుష్పక విమానం మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.విజయ్ దేవరకొండ నిర్మించిన ఈ సినిమా ను పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు.
తమ్ముడు ఆనంద్ దేవరకొండ ను హీరోగా నిలబెట్టడం కోసం విజయ్ దేవరకొండ చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు.పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్పక విమానం సినిమా తో ఆనంద్ దేవరకొండ కమర్షియల్ హీరోగా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమాను విజయ్ దేవరకొండ చిన్న బడ్జెట్ తో నిర్మించినా కూడా భారీ ప్రమోషన్స్ చేసి పెద్ద సినిమాగా మార్చేశాడు.సినిమా చిత్రీకరణ సమయం నుండే ఈ సినిమాపై అంచనాలు పెంచేలా చేశారు.
ఈ సినిమాను విజయ్ దేవరకొండ దాదాపుగా నాలుగు కోట్ల బడ్జెట్ తో నిర్మించాడని సమాచారం అందుతోంది.

నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపుగా 5 కోట్ల రూపాయలను దక్కించుకుంది.శాటిలైట్ రైట్స్ మరియు ఓటీటీ రైట్స్ ద్వారా మరో మూడు కోట్లకు మించి ఈ సినిమా దక్కించుకునే అవకాశం ఉంది.మొత్తంగా ఈ సినిమా పది కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
నాలుగు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే ఇంత భారీ లాభాలను దక్కించుకోవడం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ మార్కెటింగ్ స్టాటజీ అనడంలో సందేహం లేదు.ఆయన ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడంతో పాటు విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి తమ్ముడితో కలిసి సోషల్ మీడియాలో సందడి చేయడం జరిగింది.
అందుకే పుష్పక విమానం సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి.పుష్పక విమానం అనేది సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఒక క్లాసిక్ మూవీ.టైటిల్ కారణంగా కూడా సినిమా అంచనాలు భారీగా ఉన్నాయి.మరి జూనియర్ రౌడీ సక్సెస్ దక్కించుకుంటాడా అనేది చూడాలి.