దేశవ్యాప్తంగా కొందరి స్మార్ట్ ఫోన్లకు వచ్చిన ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ తో ప్రజలు కలవరపాటుకు గురయ్యారు.అయితే స్మార్ట్ ఫోన్లకు వచ్చిన ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ పై కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్ లో భాగంగా ఈ అలర్ట్ మెసేజ్ లను కేంద్ర ప్రభుత్వమే పంపింది.ఈ మేరకు భారత టెలీ కమ్యూనికేషన్ విభాగం రా సెల్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ నుంచి ఈ టెస్టింగ్ మెసేజ్ ను పంపించినట్లు అధికారులు తెలిపారు.
అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందించే విధంగా ప్రసార సామర్థ్యాలను అంచనా వేసేందుకు టెస్టింగ్ నిర్వహించారని తెలుస్తోంది.పెద్ద బీప్ శబ్దంతో స్క్రీన్ పై అలర్ట్ కనిపించింది.
ఇది తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ వచ్చింది.అయితే ఇక ఒక శాంపిల్ టెస్ట్ మేసేజ్.
ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపబడిన నమూనా పరీక్ష సందేశం.దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి.
ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు.ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న TSET ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది.
మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రజా భద్రత మరియ అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాం అని సదరు అలర్ట్ మెసేజ్‌లో పేర్కొన్నారు.