అధిక బరువు ఊబకాయం సమస్య ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం..

నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అనేది కాలేయం లో కొవ్వు పెరగడం వల్ల వస్తుంది.అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 People With Overweight And Obesity Are At Risk Of Developing This Disease. , Ov-TeluguStop.com

వీరిలో ఈ వ్యాధి నెమ్మదిగా ముదిరిపోతూ ఉంటుంది.దీనిని ప్రారంభ దశలో గుర్తించడానికి స్పష్టమైన లక్షణాలు ఏవి ఉండవు.

వ్యాధి తీవ్రత పెరిగిపోతున్నప్పుడు వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.ఇవి కాలక్రమమైన మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ వ్యాధికి సకాలంలో చికిత్స తీసుకోలేకపోతే కాలేయం దెబ్బతింటుంది.శరీరంలో కొవ్వు పరిమాణం కాలేయం బరువులో పది శాతం పెరిగినప్పుడు కాలేయం ఫ్యాటీ లివర్ గా మారుతుంది.

Telugu Exercise, Fattyliver, Tips, Obesity-Telugu Health Tips

ఇది ఎక్కువ గా జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది.అతిపెద్ద కష్టమేంటంటే ఫ్యాటి లివార్ సమస్య గురించి చాలా సార్లు చాలామందిలో ఆలస్యంగా తెలుస్తుంది.అందుకే రక్షించడం చాలా కష్టమవుతుంది.నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ ఎక్కువగా ఆహారం పానీయాల వల్ల వస్తుంది.జిడ్డు గల ఆహారాన్ని తినడం లేదా బయట ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కొన్ని మూలకాలు శరీరంలో చేరిపోతాయి.ఇవి బరువును నేరుగా ప్రభావితం చేస్తాయి.

Telugu Exercise, Fattyliver, Tips, Obesity-Telugu Health Tips

పెరుగుతున్న ఉబకాయం లేదా మధుమేహం కారణంగా ఒక వ్యక్తికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండవచ్చు.ఇది తరచుగా ఒక రకమైన ఆహారాన్ని ఎక్కువసేపు తీసుకోవడం వల్ల వస్తుంది.ఒక రకమైన ఆహారాన్ని ఎక్కువకాలం తినకూడదని వైద్య నిపుణులు  చెబుతున్నారు.ఈ సమస్యను నివారించడానికి ఆహారం కచ్చితంగా మారుస్తూ ఉండాలి.వేయించిన రోస్టు చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు.శరీరం ఫిట్ గా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube