అధిక రక్తపోటు.నేటి ఆధునిక కాలంలో పాతిక, ముప్పై ఏళ్లు దాటగానే అత్యధిక మందిని వేధించే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
రక్తపోటు స్థాయిలు ఉండాల్సిన దానకంటే ఎక్కువగా ఉండటంమే అధిక రక్తపోటు ఉంటాయి.ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ.
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.అయితే అధిక రక్త పోటు ఉన్న వారిలో చాలా మంది చేసే పని.
బీపీని కంట్రోల్ చేసుకునేందుకు మందులు వేసుకోవడం మరియు ఉప్పూ, కారాలు తినడం తగ్గించడం.
అయితే వాస్తవానికి ఇవే కాదు.
అధిక రక్తపోటుతో బాధ పడే వారు మరి కొన్ని జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హై బీపీ ఉన్న వారు ముందుగా ఒత్తిడికి దూరంగా ఉండాలి.ఒత్తిడి పెరిగే కొద్ది.
రక్త పోటు కూడా పెరిగిపోతుంది.అందువల్ల, మైండ్‌ను మరియు మెదడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి.
అధిక రక్తపోటుకు దూరం ఉండండి.
అలాగే కాఫీ.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే పానియాల్లో ఇది ఒకటి.రోజుకు ఒకసారి కాదు.
నాలుగైదు సార్లు కాఫీ తాగే వారు ఉంటారు.కానీ, అధిక రక్త పోటు ఉన్న వారు కాఫీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికంగా తీసుకోరాదు.
కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల, కాఫీని అతిగా తీసుకుంటే.
బ్లడ్ ప్రెజర్ మరింత పెరిగిపోయి.ప్రాణాలే డేంజర్‌లో పడతాయి.
అందువల్ల, హై బీపీ ఉన్న వారు కాఫీని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది.

ఆల్కహాల్ మరియు సిగరెట్స్..ఈ రెండూ రక్తపోటును పెంచేవే.కాబట్టి, ఈ రెండిటికి దూరంగా ఉండాలి.అలాగే అధిక రక్త పోటు ఉన్న వారు ఊరగాయలు, నిల్వ పచ్చళ్ళు, చిప్స్, నూనెలో వేయించిన వేపుళ్ళు, చిరుతిళ్ళు, బేకరీ ఫుడ్స్ వంటి వాటిని తినడం మానెయాలి.
బరువును ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.తరచూ చకప్ కూడా చేయించుకోవాలి.