ఒక మనిషి నిద్రపోకుండా ఎన్ని రోజులు జీవించగలడో తెలుసా..?

సాధారణంగా చెప్పాలంటే దాదాపు చాలామంది పగటి పూట వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే శ్వాస తీసుకోవడం, తినడం, తాగడం, నడవడం, నిద్రపోవడం అనేది ప్రతి మనిషి జీవితంలో జరుగుతూ ఉంటుంది.

 Do You Know How Many Days A Man Can Live Without Sleeping,  Sleep, Health , Hea-TeluguStop.com

ప్రతి చర్యకు ఒక కారణం మరియు ప్రాముఖ్యత ఉంటుంది.మనిషి శ్వాస తీసుకోవడం ఆపేసినప్పుడు మనిషి చనిపోయాడని అర్థం చేసుకోవచ్చు.

నీరు లేకుండా మనిషి జీవించడం కష్టం.అలాగే మనిషికి కొన్ని రోజులపాటు నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలతో( Health problems ) పాటు మరణించే అవకాశం కూడా ఉంది.

ఎందుకంటే రాత్రి సమయంలో 7 నుంచి 8 గంటల నిద్ర మనిషికి మళ్లీ శక్తిని అందిస్తుంది.కానీ ఒక వ్యక్తి చాలా రోజులు నిద్ర పోకపోతే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Heart, Heart Problems, Sleep, Mind-Telugu Health Tips

నిద్ర మానవ జీవితంలో చాలా ముఖ్యమైనది.మనిషి ఒకరోజు పొరపాటున కాస్త త్వరగా నిద్రలేస్తే మరుసాటి రోజు మీ దినచర్య భిన్నంగా ఉంటుంది.ఇలా నిద్ర లేవడం వల్ల మనిషి ఆ రోజు అలసిపోయినట్లు అనిపిస్తుంది.ఒక వ్యక్తి నిద్ర లేకుండా ఎంత కాలం జీవించగలడు అనే విషయం గురించి ఎవరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు.

రాత్రి సమయంలో తగినంత నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యానికి అంత మంచిది కాదు.మంచి నిద్ర కోసం ప్రతి రోజు కనీసం ఏడు నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం అవసరమని ఆరోగ్యా నిపుణులు చెబుతున్నారు.

Telugu Tips, Heart, Heart Problems, Sleep, Mind-Telugu Health Tips

తక్కువ నిద్ర( Sleep ) మీ ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది.తగినంత నిద్ర లేకపోవడం అనేక వ్యాధులకు కారణం అవుతుంది.ఇది మీకు గుండె సంబంధిత సమస్యల ( Heart problems )ప్రమాదాన్ని కలిగిస్తుంది.ఒక నివేదిక ప్రకారం ఒక వ్యక్తి 11 రోజుల పాటు మెలకువగా ఉండగలడు.

ఒక వ్యక్తి 11 రోజులు నిద్రపోకపోతే చనిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది.కొన్ని పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తి నిద్రపోకుండా మొదటి కొన్ని రోజుల్లో అతనికి మరింత ఇబ్బంది ఉంటుంది.ఆ తర్వాత శరీరం బలహీనంగా మరి చచ్చు పడినట్లు అనిపిస్తుంది.11వ రోజున వ్యక్తి యొక్క మానసిక స్థితి ( State of mind )దెబ్బతింటుంది.12వ రోజున వ్యక్తి మరణించే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube