జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు.ఇప్పటికే ఆయన దేవర సినిమాతో( Devara ) మంచి గుర్తింపును సంపాదించుకొని మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే.
కానీ ఇప్పుడు ‘వార్ 2’( War 2 ) సినిమాతో మరోసారి ఆయన పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంతసేపు కనిపించబోతుంది అనే దానిమీద ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.
కొంతమంది ఎన్టీఆర్ క్యారెక్టర్ 15 నిమిషాలు ఉంటుందని చెప్తుంటే మరి కొంతమంది మాత్రం 40 నిమిషాల పాటు ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తున్నారు.
కానీ ఈ సినిమా నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ గా నటిస్తున్నాడా లేదంటే ఫుల్ లెంత్ పాత్రలను పోషిస్తున్నాడా లేదా 30 నిమిషాల పాటు కనిపించే పాత్రలో చేస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో మల్టీస్టారర్ సినిమాని చేసిన జూనియర్ ఎన్టీఆర్ మరోసారి మల్టీ స్టారర్ సినిమాతో పాన్ ఇండియాలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
అందుకే ఆయన హృతిక్ రోషన్ తో( Hrithik Roshan ) కలిసి ఈ భారీ ప్రయోగానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది…ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఎన్టీఆర్ స్టార్ డమ్ అనేది పాన్ ఇండియా లెవెల్లో భారీగా దూసుకుపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలను చేస్తాడు తద్వారా ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…ఇక ఇప్పటికే ఎన్టీయార్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు…
.