సోషల్ మీడియా ఇప్పుడు ఫుడ్ ఎక్స్‌పెరిమెంట్స్ ప్రదర్శించడానికి ఒక వేదికగా మారింది.చాక్లెట్ రసగుల్ల వంటి క్రియేటివ్ డిష్‌ల నుంచి విచిత్రమైన మ్యాగీ రెసిపీల వరకు, మనం ఆన్‌లైన్‌లో చాలా వెరైటీ ఫుడ్ ట్రెండ్స్‌ను చూస్తున్నాం.
కొన్ని ఫుడ్ ఐడియాలు మనల్ని ఆకట్టుకుంటే, మరికొన్ని మనల్ని కంగారు పెడుతున్నాయి.ఇలాంటి వంటకాలకు సంబంధించిన ఒక వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
@katiewilltryanything అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ థాంక్స్‌గివింగ్ టర్కీని వంట చేయడానికి ఒక ఆశ్చర్యకరమైన పద్ధతిని పంచుకున్నారు.ఆమె టర్కీ పక్షి మాంసాన్ని టాయిలెట్‌లో వండడానికి ప్రయత్నించారు!
కేటీ (kati)అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నవంబర్ 27న తన చిత్రమైన వంట పద్ధతిని చూపించే ఒక వీడియోను పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో, ఆమె పూర్తిగా తోలు తీసిన టర్కీ పక్షిని టాయిలెట్ బౌల్‌లో(toilet bowl) ఉంచింది.ఆ తర్వాత, ఆమె టర్కీని ఉల్లిపాయలు, ఆరెంజెస్, సెలరీ కొమ్ములు(Onions, oranges, celery stalks) వంటి కూరగాయలు, పండ్లతో నింపింది.
రుచి కోసం ఆమె వెల్లుల్లి పొడి వంటి మసాలాలు కూడా జోడించింది.ఆ తర్వాత, ఆమె టర్కీని ఒక బేకింగ్ ట్రేకి మార్చి, దానిపై ఒక పెద్ద బటర్ స్టిక్ పూసింది.
చివరగా, ఆమె టర్కీని 300 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రత వద్ద బేక్ చేసింది.అంటే ఆ పక్షి మాంసంలో ఆహారాలు జోడించేటప్పుడు దానిని టాయిలెట్ బేసిన్‌లోనే ఉంచింది.
కేటీ(Kati) తన క్యాప్షన్‌లో, “థాంక్స్‌గివింగ్ డిన్నర్ చేస్తున్నా.భయపడకండి, క్రిములు 140 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద చనిపోతాయి.నేను దీన్ని 300 డిగ్రీల వద్ద వండాను” అని రాసింది.ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.చాలా మంది ఆమె విచిత్రమైన వంట పద్ధతిని విమర్శించారు.ఒక వ్యక్తి, “కేట్, ఈ థాంక్స్‌గివింగ్‌కి(Thanksgiving) నువ్వు ఇంట్లోనే ఉండాలి అనుకుంటాను” అని కామెంట్ చేశారు.
మరొకరు, “కానీ దీని ఉద్దేశం ఏమిటి, నీకేమైనా మతి పోయిందా” అని అడిగారు.మరొకరు, “దీన్ని నువ్వు ఎవరికీ వడ్డించలేదని నేను చెప్పగలను” అని ఓ యూజర్ అన్నారు.
“నేను ఎప్పుడూ నీ ఇంటికి రాను లేదా నిన్ను ఆహ్వానించను, ఆహారం వృథా.నేను దాదాపు వాంతి చేసుకున్నాను.” అంటూ నెటిజన్లు చాలా అసహ్యం వ్యక్తం చేశారు.థాంక్స్ గివింగ్ పండుగను కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, వంటి పశ్చిమ దేశాల్లో జరుపుకుంటారు.